మా బ్లాగును సందర్శించినందుకు ధన్యవాదాలు. ఈ సైట్‌లో పోస్ట్ చేయబడిన అంశాలు మీకు ఆశీర్వదకరంగా ఉండాలని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము. దయచేసి బ్లాగును దర్శించడానికి సంకోచించకండి అలాగే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ సైట్‌లో పోస్ట్ చేయబడిన అంశాల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరచడానికి మేము నిరంతరం ప్రయత్నిస్తున్నందున మీ వ్యాఖ్యలు మరియు దిద్దుబాట్లను మేము స్వాగతిస్తున్నాము.

ఈ బ్లాగ్ సైట్‌లో వివిధ భాషల్లోకి అనువదించబడి ఉన్న ఆంగ్ల వ్యాసాల రచయిత అయిన రామ్ కృష్ణమూర్తిగారు కెనడాలోని ఒంటారియోలోని విండ్సర్‌లో ఉన్న గ్రేస్ బైబిల్ చర్చ్ పాస్టర్. ఆయన భార్య పేరు గీత, ఆయనకు పాల్ మరియు ప్రీతి అనే ఇద్దరు పెద్దల పిల్లలు ఉన్నారు. ఆయనను నేరుగా rk2serve@yahoo.com లో సంప్రదించవచ్చు.

ఒక క్రైస్తవ స్నేహితుని యొక్క నమ్మకమైన సాక్ష్యం ద్వారా మరియు అదే సమయంలో USAలోని టెక్సాస్‌లో చదువుతున్నప్పుడు తెలియని వ్యక్తి తన ఇంటి గుమ్మం ముందు ఉంచిన బైబిలును చదవడం ద్వారా దేవుడు దయతో రామ్‌ రక్షించబడ్డారు. ఆయన పాస్టర్‌గా పనిచేస్తున్న చర్చి వెబ్‌సైట్‌లో మీరు ఆయన గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు: www.gbc-windsor.org . రామ్ మరియు ఇతర దైవజనులు బోధించిన ఉపన్యాసాలను కూడా చర్చి వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఈ బ్లాగ్ నిరంతరం అనేక భాషల్లోనికి కూడా అనువదించబడుతోంది. ప్రభువు దయతో అవకాశాలు ఇచ్చినప్పుడు మేము మరిన్ని నూతన భాషలను జోడించాలని ఆశిస్తున్నాము. ప్రభువు అనుమతించినన్ని భాషా సమూహాలకు ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సువార్తను పంచుకోవడానికి మేము కట్టబడి ఉన్నాము. ఈ ప్రాజెక్టులో దైవభక్తి మరియు అర్హత కలిగిన అనువాదకులు, నైపుణ్యం కలిగిన కంప్యూటర్ నిపుణులు ఉన్నారు. ప్రియమైన ఈ సహోదరి సహోదరుల సమిష్టి కృషి లేకుండా ఈ ప్రాజెక్టుకు ఉనికి లేదు. ప్రభువు తనను తాను మహిమపరచుకోవడానికి తగినరీతిలో ఈ బ్లాగును ఉపయోగించుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము!

గమనిక: ఈ బ్లాగ్‌లోని మరియు ఇతర భాషా ప్రధాన బ్లాగ్‌లోని మెటీరియల్‌లు ఏవీ కాపీరైట్ చేయబడలేదు. కాబట్టి, దయచేసి వాటిని అవసరమైన విధంగా ఉపయోగించడానికి సంకోచించకండి. రచయిత పేరు కూడా అవసరం లేదు. దేవునికే మహిమ కలగాలి!

మీకు రెండు అభ్యర్థనలు

ప్రభువు మిమ్మల్ని నడిపిస్తే:

1. దయచేసి ఈ వెబ్‌సైట్‌ ఆయన మహిమ కలిగేలా ఉపయోగించబడాలని ప్రార్థిస్తారా?

2. దయచేసి ఈ వెబ్‌సైట్ మరియు ఇతర భాషా ప్రధాన వెబ్‌సైట్‌ల గురించి వాటి నుండి ప్రయోజనం పొందగలిగే వారికి తెలియజేయగలరా?

మనము ఏమి నమ్ముతాము

  • బైబిలు అనేది దేవుడు మానవాళికి ఇచ్చిన దోషరహితమైన నిత్యమైన వ్రాతపూర్వక ప్రకటన. జీవితవిధానానికి విశ్వాసానికి దీనికే ఏకైక అధికారం ఉంది.
  • ఒకే ఒక నిజమైన సజీవ దేవుడు ఉన్నాడు ఆయన నిత్యం తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే మూడు రూపాలలో ఉంటారు. మనం ఆరాధించడానికి విధేయత చూపించడానికి ఈ ముగ్గురూ సమాన అర్హత కలిగినవారు.
  • యేసు మానవునిగా మారిన దేవుడు. ఆయన కన్యకు జన్మించి పాపరహిత జీవితాన్ని గడిపారు, మన పాపాల కోసం సిలువపై మరణించి పాతిపెట్టబడి మూడవ రోజున సమాధిలో నుండి సజీవంగా లేచి తన తండ్రి కుడి చేతికి ఆరోహణమైనారు. ఒక రోజు ఆయన మరలా అధికారంతో మహిమతో భౌతికంగా తిరిగి వస్తారు.
  • పరిశుద్ధాత్మ ప్రేరణతో పశ్చాత్తాపపడిన పాపి విశ్వాసంతో తనకు ప్రభువూ రక్షకుడైన యేసుక్రీస్తుకు మాత్రమే తన జీవితాన్ని అప్పగించినప్పుడు, పాపాత్ముడై తప్పిపోయిన ఆ వ్యక్తికి తక్షణమే రక్షణ లభిస్తుంది.
  • కేవలం యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా లభించే దేవుని కృప వలనే మాత్రమే రక్షణ లభిస్తుంది. ఏ మానవ కార్యాలపైన గాని వారు సాధించి విజయాలపైన గాని అది ఆధారపడి ఉండదు. నిజంగా రక్షింపబడిన ప్రజలందరూ దేవుని శక్తిచే కాపాడబడతారు; క్రీస్తులో శాశ్వతంగా సురక్షితంగా ఉంటారు.
  • పరిశుద్ధాత్మ విమోచన దినం వరకు విశ్వాసులలో నివసిస్తుంది, వారిని పవిత్రపరుస్తుంది, నడిపిస్తుంది, శక్తినిస్తుంది మరియు వారిని ముద్రిస్తుంది.
  • యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు. సంఘం తాను చేసే ప్రతి దానిలో లేఖనాలకు లోబడి ఉండాలి.
  • తమ పాపక్షమాపణ కోసం క్రీస్తును మాత్రమే విశ్వసించిన వారు పరలోకంలో నిత్యత్వాన్ని గడుపుతారని, క్రీస్తు లేకుండా తమ పాపాలలో మరణించిన మిగిలిన వారు నిత్యం నరకంలో గడుపుతారని మనము నమ్ముతున్నాము.