మన సంఘాలలో వ్యక్తిగత జీవితాలలో ప్రార్థనకు అధిక ప్రాధాన్యత ఇచ్చుట

(English version: “Giving Prayer A Higher Priority In Our Churches And In Our Personal Lives”)
ఆదివారం ఉదయం ఎవరు వస్తున్నారనే దాని బట్టి ఆ సంఘం ఎంత ప్రాచుర్యం పొందిందో చెప్పవచ్చు. ఆదివారం రాత్రి వచ్చేవారిని బట్టి పాస్టరు లేదా సువార్తికుడు ఎంత ప్రాచుర్యం పొందారో అలాగే ప్రార్థన కూడికకు వచ్చే వారిని బట్టి యేసు ఎంత ప్రజాదరణ పొందారో చెప్పవచ్చు అంటారు. అయితే ప్రతి విశ్వాసికి ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే: “నేను వెళ్ళే సంఘం లో యేసు ఎంత ప్రజాదరణ పొందాడు?” మరియు మన వెళ్ళే సంఘం లో యేసు జనాదరణ పొందాలంటే, మొట్టమొదటగా ఆయన మన వ్యక్తిగత జీవితంలో ప్రసిద్ధి చెందాలి. మరో మాటలో చెప్పాలంటే, మన వ్యక్తిగత ప్రార్థన జీవితం సంఘప్రార్థన జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
ప్రార్థనకు సంబంధించిన అపొస్తలుల కార్యముల గ్రంథం నుండి తీసుకోబడిన ఈ వాక్యాల్ని రాబోయే రోజుల్లో ప్రార్థనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా యేసును ప్రసిద్ది చేసేలా మన సంఘాలను మరియు మనలను ప్రోత్సహిస్తాయి.
అపొ కా 1:14 “వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.”
అపొ కా 1:24-25 “ఇట్లని ప్రార్థనచేసిరి, అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా, 25 తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.”
అపొ కా 2:42 “వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.”
అపొ కా 3:1 “పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచున్నారు.”
అపొ కా 4:24, 29, 31 “24 వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు…29 ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి…31 వారు ప్రార్థనచేయగానే వారు కూడియున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.”
అపొ కా 6:3-4 “3 కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము; 4అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి.”
అపొ కా 6: 6 “వారిని అపొస్తలులయెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థనచేసి వారిమీద చేతులుంచిరి.”
అపొ కా 7:60 “అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను.”
అపొ కా 8:15-16 “15 వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారికొరకు ప్రార్థనచేసిరి. 16 అంతకు ముందు వారిలో ఎవనిమీదను ఆయన దిగియుండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి.”
అపొ కా 8:22-24 “22 కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని మారుమనస్సునొంది ప్రభువును వేడుకొనుము; ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును; 23 నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. 24 అందుకు సీమోను మీరు చెప్పినవాటిలో ఏదియు నా మీదికి రాకుండ మీరే నాకొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను.”
అపొ కా 9:11 “అతడు, ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు, నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు.”
అపొ కా 9:40 “పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి, తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను.”
అపొ కా 10:2 “అతడు తన యింటివారందరితోకూడ దేవునియందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థనచేయు వాడు.”
అపొ కా 10:9 “మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంటలకు పేతురు ప్రార్థనచేయుటకు మిద్దెమీది కెక్కెను.”
అపొ కా 12:5 “పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.”
అపొ కా 13:2-3 “2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. 3 అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి.”
అపొ కా 14:23 “మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్థనచేసి, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి.”
అపొ కా 16:13 “విశ్రాంతిదినమున గవిని దాటి నదీతీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, కూడివచ్చిన స్త్రీలతో మాటలాడు చుంటిమి.”
అపొ కా 16:16 “మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా [పుతోను అను] దయ్యముపెట్టినదై, సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను.”
అపొ కా 16:25 “అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖైదీలు వినుచుండిరి.”
అపొ కా 20:36 “అతడీలాగు చెప్పి మోకాళ్లూని వారందరితో ప్రార్థన చేసెను.”
అపొ కా 21:5 “ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా, భార్యలతోను పిల్లలతోను వారందరు మమ్మును పట్టణము వెలుపలివరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్రతీరమున మోకాళ్లూని ప్రార్థనచేసి యొకరియొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి.”
అపొ కా 27:29, 35 “అప్పుడు రాతి తిప్పలుగల చోట్ల పడుదుమేమో అని భయపడి, వారు ఓడ అమరములోనుండి నాలుగు లంగరులువేసి యెప్పుడు తెల్లవారునా అని కాచుకొని యుండిరి…35 ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తినసాగెను.”
అపొ కా 28:8 “అప్పుడు పొప్లియొక్క తండ్రి జ్వరముచేతను రక్తభేదిచేతను బాధపడుచు పండుకొని యుండెను. పౌలు అతనియొద్దకు వెళ్లి ప్రార్థనచేసి, అతనిమీద చేతులుంచి స్వస్థపరచెను.”
వ్యక్తిగత మరియు సంఘ ప్రార్థనల గురించి 25కి పైగా వాక్యభాగాలు! మనం ఇక్కడ చూసినట్లైతే క్రైస్తవులకు ప్రార్థన చాలా ముఖ్యము. సంఘం మరియు సంఘసభ్యులు ప్రార్థనకు అధిక ప్రాధాన్యతనిచ్చినందున వారు మహాశక్తివంతులగా ఉండటంలో ఆశ్చర్యం లేదు!
కాబట్టి మన వ్యక్తిగత జీవితాలలో మరియు మన స్థానిక సంఘంలో మనం ప్రార్థనకు ఎలా ఎల్లప్పుడు ప్రాధాన్యతను ఇవ్వగలము? పాల్ మిల్లర్ వ్రాసిన ఒక అద్భుతమైన పుస్తకం “ఎ ప్రేయింగ్ లైఫ్” లో దానికి సమాధానం ఉంది. అతను ఏమి వ్రాసాడంటే, “నిరంతరంగా ప్రార్థించడానికి మీకు స్వీయ-క్రమశిక్షణ అవసరం లేదు; మీరు ఆత్మలో పేదవారిగా ఉండాలి.” మరో మాటలో చెప్పాలంటే, ప్రార్థన చేయడానికి ప్రేరేపించబడటానికి, మనం మరింత క్రమశిక్షణను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు [కాని దాని విలువ దానికి ఉంది] కాని మనం ఎంత అవసరంలో ఉన్నామనే దానిపై దృష్టి పెట్టాలి!
మనం ఆత్మలో ఎంత పేదవారిగా ఉంటే అనగా మనం ఆధ్యాత్మికంగా ఎంతగా దివాలా తీయబడ్డామో అర్థం చేసుకుంటే అంతగా ప్రతిదానికీ ప్రభువు అవసరమని అర్థం చేసుకుంటాము; అంతగా మనం మోకాళ్లపై నిలబడి వ్యక్తిగత సంఘ ప్రార్థనలో ఆయన వైపు చూస్తాము. దేవుడు కార్యం చేస్తే తప్ప లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత వలన ఏదీ జరగదనే గంభీరమైన సత్యాన్ని గ్రహించడానికి అలాంటి వైఖరి మనకు సహాయపడుతుంది. దేవుడు తన ప్రజల జీవితాల్లో శక్తివంతమైన కార్యం చేయాలని కోరుకుంటున్నప్పుడు ఆయన చేయాలనుకున్న దానిని మానవులమైన మన ప్రయత్నాలు ఎప్పటికీ సాధించలేవు.
“యేసు వలె ప్రార్థించే గురువుకు ప్రార్థన లేని సేవకులు ఉండకూడదు!” అనే మాటలు ఎంత ఖచ్చితమైనవి. దత్తపుత్రాత్మ ఎల్లప్పుడూ ఒక వ్యక్తిని దేవునికి మొర పెట్టేలా చేస్తుంది. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనం భవిష్యత్తులో ప్రార్థనకు అధిక ప్రాధాన్యతనిచ్చి తద్వారా మన సంఘాలలో మన వ్యక్తిగత జీవితాలలో యేసును ప్రసిద్ధి చెందేలా చేయడానికి మనకు సహాయం చేయును గాక.