రూపాంతరం చెందిన జీవితము 7వ భాగము- శ్రమలను భరించడానికి 6 ప్రేరణలు

Posted byTelugu Editor June 25, 2024 Comments:0

(English version: “The Transformed Life – 6 Motivations To Endure Suffering – Part 1,” “The Transformed Life – 6 Motivations To Endure Suffering – Part 2”)

రోమా ​​​​12:12లో “శ్రమయందు ఓర్పు గలవారై ఉండండని” మనకు ఆజ్ఞాపించబడింది. అలా చేయడం తేలికైన విషయం కాదు. అయితే, ఈ ఆజ్ఞకు లోబడమని బైబిలు మనల్ని పిలుస్తుంది కాబట్టి దీనితో సహా దేవుని ఆజ్ఞలన్నిటిని పాటించేలా మనకు శక్తినిచ్చే పరిశుద్ధాత్మ సహాయంతో ఇది చేయవచ్చు.

ద్రాక్షరసం తయారీకి అధిక ఒత్తిడిని ఉపయోగించి ద్రాక్షపండ్లను నలిపే విధానాన్ని తెలియచేయడానికి శ్రమ అనే పదం ఉపయోగించబడింది. ఓర్పు అనే పదానికి దృఢంగా, సహనంతో లేదా పట్టుదలతో ఉండాలనే భావం ఉంది. ఈ పదాలు తీవ్రమైన ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండాలనే భావం కలిగి ఉంటాయి.

సాధారణంగా, మనకు శ్రమలు ఎదురైనప్పుడు ఎలా ప్రతిస్పందిస్తామంటే,

(ఎ) వీలైతే అడ్డ దారి వెతుకుతాము
(బి) దాని నుండి బయటపడలేము కాబట్టి ప్రతికూల వైఖరితో సహిస్తాము
(సి) దేవుడు తన సమయంలో తన చిత్తప్రకారం జోక్యం చేసుకునే వరకు ఎదురుచూస్తూ ఓర్పుతో సహిస్తాము.

మనం ఎప్పుడూ చివరి దానినే ఎంచుకోవాలని నా ప్రార్థన. అలా చేయడం ద్వారా, మనం రోమా ​​​​12:12లోని ఈ ఆజ్ఞకు విధేయత చూపడమే కాకుండా శ్రమలన్నిటిని ఓర్పుతో దేవుని మహిమపరిచే విధంగా సహించిన యేసులా మనల్ని మరింతగా మార్చడానికి పరిశుద్ధాత్మను అనుమతిస్తాము. కానీ, అది మనం ఎలా చేయాలి? అన్ని రకాల శ్రమలను సహించడానికి మనకు సహాయపడే 6 ప్రేరణల ద్వారా అది చేయవచ్చు.

ప్రేరణ #1. శ్రమలు మనల్ని విచ్ఛిన్నం చేస్తాయి కాబట్టి మనం ప్రార్థనలో ఎక్కువగా దేవుని వెతుకుతాం.

నిజంగా మనం ఎంత బలహీనులమో మనకు ప్రభువు అవసరం ఎంత ఉందో శ్రమలు మనకు తెలియచేస్తాయి. ఇవి మన మోక్షానికి మనపై ఆధారపడే ధర్మం [అహంకారం] నుండి మనల్ని విముక్తి చేస్తుంది,. విడుదల కోసం దేవునికి మొర పెట్టేలా చేస్తాయి. వాస్తవానికి, రోమా ​​​​12:12లోని తర్వాతి వాక్యంలో ప్రార్థించమని చెప్పబడింది. పౌలు తన శరీరంలో ఉన్న ముల్లు గురించి ప్రార్థించి దేవునికి మొర పెట్టాడు [2 కొరి 12:7-8]. యోబు అనుభవించిన శ్రమలు అతడిని విరగ్గొట్టి దేవునికి దగ్గర చేశాయి. మనకు కూడా అదే వర్తిస్తుంది. శ్రమలకు మనల్ని విచ్ఛిన్నం చేసే శక్తి ,  ప్రార్థనకు మనల్ని దేవునికి దగ్గర చేసే సామర్థ్యం ఉంటుంది .

ఇద్దరు అన్నదమ్ములు చెరువు దగ్గర ఆడుకుంటున్నారు. చెరువులో కాగితపు పడవ వేసిన తమ్ముడు అది దూరంగా వెళ్తుంటే దిగులుగా చూస్తూ నిలబడ్డాడు. అది చూసిన అన్న తమ్మునికి పడవ అందేలా పడవ ఒడ్డు చేరడానికి అలలు పుట్టించడానికి పడవ వెనుక రాళ్లు విసరడం మొదలుపెట్టాడు. అదే విధంగా, ప్రార్థనలో మనల్ని తనకు దగ్గరగా తీసుకురావడానికి దేవుడు శ్రమలను ఉపయోగిస్తాడు.

దేవుడు మనల్ని ఎప్పుడైనా విచ్ఛిన్నం చేసాడా ?అవును అయితే, మన పరీక్షల తర్వాత మనం మరింత అణకువగా ఉన్నామా? ప్రార్థనలో మనం దేవునికి దగ్గరవుతున్నామా? అలా జరగకపోతే, మనం ఇప్పుడే కొత్తగా ప్రారంభించవచ్చు. మన గర్వాన్ని అణచివేసి మనం దేవునికి దగ్గరగా వెళ్లడానికి దేవుడు ఉపయోగించే సాధనంగా ప్రతి శ్రమను చూడడం నేర్చుకోవాలి. మనం నేర్చుకోకపోతే, మన దుఃఖాన్ని వృధాగా పోగొట్టుకుంటున్నట్లే.

ప్రేరణ #2. శ్రమలు మన విశ్వాసంలోని యథార్థతను రుజువు చేస్తాయి.

1 పేతురు 1:6-7లో, “6 ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానావిధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. 7నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.” మనకు శ్రమలు ఎదురైనప్పుడు మనం స్పందించే విధానం మన విశ్వాస స్వభావాన్ని తెలియచేస్తుంది.

మార్కు 4:17లో, “అయితే వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగ గానే వారు అభ్యంతరపడుదురు” అని యేసు మనకు చెప్పారు. అలాగే నిజమైన విశ్వాసులు దానిని అవలంబించి “ఓపికతో ఫలించువారు” అని కూడా యేసు చెప్పారు [లూకా 8:15]. మరో మాటలో చెప్పాలంటే, శ్రమలు ఎదురైనప్పుడు నామకార్థవిశ్వాసులు మధ్యలోనే వదిలేస్తే నిజమైన విశ్వాసులు ఓపికతో ఉంటారు. తద్వారా వారి విశ్వాసం నిజమైనది తెలుస్తుంది.

శ్రమలు ఎదురైనప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాము? ఓపికతో సహించలేకపోతే, మనం క్రొత్తగా మొదలుపెట్టాలి. మన విశ్వాసం నిజమైనదా కాదా అని పరీక్షించడంలో మనకు సహాయం చేయడానికి శ్రమలనేవి దేవుని మార్గమని మనం చూడాలి. పరీక్షించబడిన విశ్వాసం మాత్రమే విశ్వసించదగిన విశ్వాసము. దేవుని ప్రేమ మనలను శ్రమలకు దూరంగా ఉంచదు కానీ ఈ ప్రేమ పరీక్షల ద్వారా వెళ్ళడానికి మనకు సహాయం చేస్తుంది.

ప్రేరణ #3. శ్రమలు అనుభవించే ఇతరుల పట్ల మరింత కనికరం చూపడానికి శ్రమలు మనకు సహాయం చేస్తాయి.

స్వతహాగా, మనం ఎప్పుడూ హడావిడిగా ఉంటూ ఇతరుల సమస్యలు పట్టించుకోడానికి సమయం కేటాయించము. అయితే శ్రమలు అనుభవించడం వల్ల మనం తీరిక చేసుకుని ఇతరులకు సమయం కేటాయించి వారు చెప్పేది విని అవసరమైతే వారితో కలిసి మొరపెట్టగలుగుతాము. అంతేకాదు, మనం ఇతరులను ఓదార్చడానికి కూడా సిద్ధంగా ఉంటాము. మనం వాటిని అనుభవించాం కాబట్టి అవి ఎలా ఉంటాయో మనకు తెలుసు.

2 కొరింథి 1:3-4లో, పౌలు మనతో దేవుని స్తుతించమని చెప్పాడు. “3 కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. 4 దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.” శ్రమలో ఉన్నప్పుడు మనం పొందే ఓదార్పే ఇతరులకు ఓదార్పు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది!

పాకిస్తాన్‌లో మిషనరీగా ఉన్న ఒక మహిళ వ్రాసిన మాటలు ఇవి:

నా భర్త ఫ్రాంక్‌తో కలిసి నేను చాలా సంవత్సరాల క్రితం పాకిస్తాన్‌లో నివసిస్తున్నప్పుడు మా ఆరు నెలల పాప చనిపోయింది. మా బాధ విని ముసలివాడైన ఒక పంజాబీ వ్యక్తి మమ్మలన్ని ఓదార్చడానికి వచ్చాడు. అతడు మాట్లాడుతూ, “వేడినీటిలో మునిగినట్లుగా ఈ బాధ ఉంటుంది. నీవు గుడ్డులా ఉంటే అది ఉడికి గట్టిగా మారినట్లే నీవు కూడా కఠినం అయిపోతావు. నీవు బంగాళాదుంపలా ఉంటే అది ఉడికి మెత్తగా మారినట్లు నీవు మృదువుగా తేలికగా, నిలకడగా మరియు అనుకూలతను కలిగి ఉంటావు”. నేను చాలా సార్లు ఓ ప్రభూ, నన్ను బంగాళాదుంపగా ఉండనివ్వు అని ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. అది దేవునికి హాస్యాస్పదంగా అనిపించవచ్చు.

మన శ్రమలు మరియు దాని నుండి మనం పొందిన ఆదరణ వలన ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికి సమయాన్ని వెచ్చిద్దాం. ముఖ్యమైన విషయాలకు అనగా జీవితంలో నిజంగా ముఖ్యమైన విషయాలకు సమయం ఇవ్వడం నేర్చుకుందాం. ఇతరులకు దేవుని ఆదరణ అందించే  సాధనంగా ఉండడం నేర్చుకుందాం. మనం దేవుని ఆదరణని ఉచితంగా పొందాం కాబట్టి మనం ఆ ఆదరణని ఇతరులకు ఉచితంగా ఇవ్వాలి.

మనం అలా చేస్తామా? మన బాధలు బాధపడే ఇతరుల పట్ల మనల్ని మరింత సున్నితంగా మరియు కనికరించేలా చేసిందా?శ్రమపడేవారికి తోడుగా ఉండడానికి, ప్రోత్సహించడానికి వారి అవసరాలను తీర్చడానికి మనం సమయం తీసుకుంటామా? అలా చేయకపోతే మనం ఇప్పుడు మొదలుపెట్టవచ్చు. మనల్ని ఇతరులకు ఆశీర్వాదంగా మార్చడానికి దేవుడు ఉపయోగించే సాధనంగా ప్రతి శ్రమను చూడడం నేర్చుకోవాలి. లేదంటే మన శ్రమలు వృధా అవుతాయి.

ప్రేరణ #4. విశ్వాసంలో పరిణితి చెందడానికి శ్రమలు మనకు సహాయం చేస్తాయి.

రోమా ​​​​5:3 మనకు “శ్రమ ఓర్పును కలిగిస్తుంది” అని చెబుతోంది. “మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని” యాకోబు 1:3 మనకు గుర్తుచేస్తుంది. మన జీవితాల్లో ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆటంకం కలిగించే విషయాలను శ్రమలు బహిర్గతం చేసి తొలగిస్తాయి. విశ్వాసంలో మనల్ని పరిపక్వపరచడానికి ఇది దేవుని మార్గం.

వెండిని శుద్ధి చేసే విధానం తెలుసుకోవడానికి కంసాలిని కలిసిన ఒక స్త్రీ గురించి ఒక కథ. కంసాలి వెండిని నిప్పుల మధ్యలో పటకారుతో పట్టుకుని దానినే చూస్తూ ఆ ప్రక్రియను వివరిస్తూ కొలిమిలో వెండి ఎక్కువసేపు ఉంటే కరిగిపోతుంది అలాగే తక్కువసేపు ఉంటే మలినాన్ని కోల్పోదని చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ, “మరి సరైన సమయం మీకు ఎలా తెలుస్తుంది?” అని అడిగింది. అందుకు అతడు నేను నా పూర్తి ప్రతిబింబాన్ని దానిలో చూడగలిగినప్పుడు అని చెప్పాడు. దేవుడు కూడా ఖచ్చితంగా అదే చేస్తున్నాడు. మనం ఎన్ని శ్రమలు ఎదుర్కొంటే క్రీస్తులా మారతామో ఆయనకు తెలుసు; కాబట్టి అది పూర్తయ్యే వరకు ఆయన మనల్ని కొలిమిలో ఉంచుతాడు. కానీ ఆయన కన్ను ఎప్పుడూ మనపైనే ఉంటుంది. కాబట్టి చింతించవద్దు.

శ్రమలు సహించేవారే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. వేరే మార్గం లేదు. శ్రమలెదుర్కొన్న ప్రతిసారి మనం మన విశ్వాసంలో పరిణితి చెందుతున్నామా? అలా కాకపోతే, ఇప్పటి నుండే మొదలుపెడదాము. మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడు ఉపయోగించే సాధనంగా ప్రతి శ్రమను చూడడం నేర్చుకోవాలి. లేదంటే మన శ్రమలు వృధా అవుతాయి.

ప్రేరణ #5. దేవుని ఆజ్ఞలకు ఎక్కువ విధేయత చూపడానికి శ్రమలు మనకు సహాయం చేస్తాయి.

కీర్తన 119:67లో, “శ్రమ కలుగకమునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను” అని ఉంది. కొన్ని వచనాల తరువాత, “నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను” [కీర్తన 119:71] అని చదువుతాము. శ్రమలు ఎదురైనప్పుడు మనం పాపం గురించి, దేవుని వాక్యానికి అవిధేయత చూపడం వల్ల వచ్చే పర్యవసానాల గురించి లోతుగా ఆలోచించేలా చేస్తాయి. దేవుడు ఎంత పరిశుద్ధుడో, పాపాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తాడో, దేవుని ఆజ్ఞలన్నింటికీ మనం ఎంతగా విధేయత చూపించాలో అవి మనకు చూపిస్తాయి.

ఒక రచయిత చరిత్రకు సంబంధించిన ఒక సంఘటన గురించి చెబుతూ కొన్ని పరిశీలనలు చేశాడు.

కమాండర్ ఆంటిగోనస్ దగ్గర ఉన్న ఒక సైనికుడికి సంబంధించి ఒక ప్రాచీన గ్రీకు కథ ఉంది. అతనికి చాలా భయంకరమైన వ్యాధి సోకి మరణానికి చాలా సమీపంగా ఉన్నాడు. ఆ సైనికుడు ఎప్పుడూ మొదటిస్థానంలో ఉండి, అత్యంత ధైర్యంగా తీవ్రమైన యుద్ధం జరిగే భాగానికి పరుగెత్తేవాడు. తన నొప్పిని మర్చిపోవడానికి అతడు యుద్ధం చేసేవాడు. తాను ఎక్కువకాలం జీవించనని అతనికి తెలుసు కాబట్టి మరణానికి ఎప్పుడూ భయపడలేదు.

ఆంటిగోనస్ తన సైనికుడి పరాక్రమాన్ని ఎంతో మెచ్చుకున్నాడు. అతనికున్న వ్యాధి గురించి తెలుసుకుని  అప్పుడున్న ప్రఖ్యాత వైద్యులతో అతనికి నయం చేయించాడు. అయితే, ఆ క్షణం నుండి ఆ సైనికుడు యుద్ధంలో ముందు నిలబడలేదు. ఇప్పుడు అతడు తన సౌకర్యాన్ని కోరుకున్నాడు; అతడు తన తోటి సైనికులతో, తనకు జీవించడానికి కావలసిన ఆరోగ్యం, ఇల్లు, కుటుంబం మరియు ఇతర సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి తాను గతంలోలా ఇప్పుడు యుద్ధాల్లో తన జీవితాన్ని పణంగా పెట్టలేను అన్నాడు.

అదే విధంగా, మనకు శ్రమలు ఎక్కువగా ఉన్నప్పుడు మన దేవుని కృపతో ఆయనను సేవించడంలో మనం చాలా ధైర్యంగా ఉంటాము. ఈ లోకంలో జీవించడానికి మన దగ్గర ఏమీ లేదని మనం భావిస్తాం కాబట్టి రాబోయే ప్రపంచం యొక్క ఆశతో మనం ముందుకు వెళ్తాము. క్రీస్తు కొరకు ఆసక్తి కలిగి మనల్ని మనం తగ్గించుకుని ధైర్యాన్ని చూపిస్తాము. అయితే మంచి సమయాల్లో మనం ఎంత తరచుగా ప్రతిస్పందిస్తాము?

మనం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, ఈ ప్రపంచంలోని ఆనందాలు మరియు సంతోషాలు రాబోయే ప్రపంచాన్ని గుర్తుంచుకోవడం కష్టతరం చేస్తాయి. అప్పుడు మనం అద్భుతమైన సౌకర్యాలలో మునిగిపోతాము. ప్రియులారా, ఈ లోకపు అలజడులు పులకరింతలు మిమ్మల్ని దేవుని విషయాలపట్ల ఉదాసీనంగా మార్చనివ్వకూడదు. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను అడ్డుపడనివ్వకూడదు.

మనకు ఎదురైన శ్రమలు మనం దేవుని మాటకు మరింత విధేయత చూపేలా చేశాయా? అలా కాకపోతే, మనం మళ్లీ మొదలుపెట్టవచ్చు. ముందుకు వెళ్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞలకు మరింత శ్రద్ధగా విధేయత చూపడంలో మనకు సహాయపడేందుకు దేవుడు ఉపయోగించే సాధనంగా ప్రతి శ్రమను చూడడం నేర్చుకోవాలి. లేదంటే మన శ్రమలు వృధా అవుతాయి.

ప్రేరణ #6. శ్రమలు మన భవిష్యత్తు మహిమను గూర్చిన నిరీక్షణను బలపరుస్తాయి.

రోమా ​​​​12:12లో “నిరీక్షణగలవారై సంతోషించండి” అని చెప్పబడింది. ఇక్కడ నిరీక్షణ అంటే నూతనమైన పునరుత్థాన శరీరాలను పొందినప్పుడు మనం పొందే భవిష్యత్తు మహిమ యొక్క ఆశను సూచిస్తుంది. రోమా ​​​​5:3-4లో “దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ” అనే వాక్యంలో మన శ్రమలకు మరియు నిరీక్షణ బలపడడానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేయబడింది. [రోమా 5:2] ఇది మళ్ళీ క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనం కొత్త శరీరాన్ని పొందే సమయాన్ని సూచిస్తుంది.

శ్రమలు అనుభవించని వారి కంటే శ్రమలు అనుభవించిన విశ్వాసులే క్రీస్తు తిరిగి రావాలని ఎక్కువ కోరుకుంటారు. ఎందుకంటే మహిమపరచబడాలనే వారి నిరీక్షణ చాలా బలమైనది కాబట్టి వారు దాని గురించి అన్ని సమయాలలో ఆలోచిస్తారు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే అది జరుగుతుందని తెలుసుకుని దాని కోసం వారు తహతహలాడుతూ ఉంటారు.

సాధారణంగా మనం క్రీస్తు తిరిగి రావాలని కోరుకోము, దానికి కారణం భూమిపై మనకు ఆనందం ఇచ్చే చాలా మంచి విషయాలు ఉన్నాయి, అవి నిజమైన నిధి నుండి అనగా క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనం పొందే మహిమ నుండి మన కళ్ళను తిప్పివేస్తాయి. కాబట్టి, క్రీస్తు రాకడను మనం కోరుకునేలా చేయడానికి దేవుడు ఆ మంచి విషయాలను పగులగొట్టడానికి శ్రమలను ఉపయోగిస్తారు. మన జీవితాలలో ఎదురయ్యే శ్రమలు మనం మరింత ఎక్కువగా క్రీస్తులా ఉండాలనే కోరికకు మరియు ఆయన తిరిగి రావాలని తహతహలాడడానికి కారణమయ్యాయా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి? కాకపోతే, క్రొత్తగా ప్రారంభించడానికి ఇంకా చాలా ఆలస్యం కాలేదు. మన జీవితాల్లోని బాధలను దైవికంగా చూడటం ప్రారంభించాలి, అది భవిష్యత్ మహిమ కోసం మన ఆశను బలపరుస్తుంది.

ముగింపు మాటలు.

కాబట్టి ఈ ఆరు ప్రేరణలు శ్రమలను తట్టుకోవడానికి మనకు సహాయపడతాయని నేను ఆశిస్తున్నాను.

ప్రేరణ #1. శ్రమలు మనల్ని విచ్ఛిన్నం చేస్తాయి కాబట్టి మనం ప్రార్థనలో ఎక్కువగా దేవుని వెతుకుదాము.
ప్రేరణ #2. శ్రమలు మన విశ్వాసంలోని యథార్థతను రుజువు చేస్తాయి.
ప్రేరణ #3. శ్రమలు అనుభవించే ఇతరుల పట్ల మరింత కనికరం చూపడానికి శ్రమలు మనకు సహాయం చేస్తాయి.
ప్రేరణ #4. విశ్వాసంలో పరిణితి చెందడానికి శ్రమలు మనకు సహాయం చేస్తాయి.
ప్రేరణ #5. దేవుని ఆజ్ఞలకు ఎక్కువ విధేయత చూపడానికి శ్రమలు మనకు సహాయం చేస్తాయి.
ప్రేరణ #6. శ్రమలు మన భవిష్యత్తు మహిమను గూర్చిన నిరీక్షణను బలపరుస్తాయి.

మరిన్నిటిని జోడించవచ్చు. అయితే  ఇవి మంచి ప్రారంభం కావచ్చు. మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు వీటి గురించి ఆలోచించి, ఓర్పుతో సహించేలా సహాయం చేయమని దేవుని వేడుకుందాం. ఈ ప్రయోజనాలు ఓపికగా సహించేవారికి మాత్రమే కాని అడ్డదారులలో శ్రమలు తప్పించుకునేవారికి లేదా దేవునిపై మరియు అతని ప్రజలపై కోపంతో ఉన్నవారికి కాదు.

ఒక వ్యక్తి దుఃఖాన్ని బైబిల్ పద్ధతిలో ఎదుర్కోవటానికి , ప్రసిద్ధ పాస్టర్ J.C. రైల్ చెప్పిన ప్రోత్సాహకరమైన మాటలు ఎంతో సహాయపడతాయి.

మనం ఓపికతో ముందుకు సాగాలి, లేకపోతే గెలవలేం. మనం అర్థం చేసుకోలేని చాలా విషయాలు ఉండవచ్చు, మన శరీరం మరోవిధంగా కోరుకోవచ్చు, కానీ మనం చివరి వరకు సహిద్దాం. అప్పుడు అన్ని విషయాలు స్పష్టపరచబడతాయి మరియు దేవుని నిర్వహణ ప్రణాళిక ఉత్తమమైనదని నిరూపించబడుతుంది. మీ ప్రతిఫలం భూమిపైనే పొందాలని భావించకండి, మీ మంచి విషయాలు ఇంకా రాబోతున్నాయి కాబట్టి వెనక్కి తిరగకండి.

ఈ రోజు సిలువ కానీ రేపు కిరీటం. ఈ రోజు శ్రమ రేపు జీతం. ఈ రోజు విత్తడం రేపు పంట కోయటం. ఈ రోజు యుద్ధం రేపు విశ్రాంతి. ఈ రోజు దుఃఖం కానీ రేపు ఆనందం. మరి రేపటితో పోలిస్తే ఈ రోజు ఏమిటి? నేటికి డెబ్బై సంవత్సరాలు కావచ్చు కానీ రేపు శాశ్వతత్వం. చివరి వరకు ఓర్పుగా నిరీక్షణతో ఉండండి.

యేసు చేసింది అదే. హెబ్రీ 12:1-3 ఇలా చెబుతోంది “ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున 2 మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. 3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కార మంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.”

రండి, ముందుకు వెళదాం. మనం దేవుని మహిమపరిచే విధంగా శ్రమలు సహించడం నేర్చుకోడానికి గతంలో శ్రమలు అనుభవిస్తున్నప్పుడు తాము శ్రమలకు అతీతులం కాదని తెలుసుకున్న గొప్ప క్రైస్తవులు చెప్పిన కొన్ని ప్రోత్సాహకరమైన మాటలతో నేను ఈ కథనాన్ని ముగిస్తాను.

“దేవుడు మనలను రాతి మార్గాలపైకి పంపితే ఆయన మనకు బలమైన బూట్లు అందజేస్తాడు.”

“ప్రతికూల పరిస్థితులలో జీవించి విజయం సాధించిన విశ్వాసం విలువైనది. పరీక్షించబడిన విశ్వాసం అనుభవాన్ని తెస్తుంది. మీరు శ్రమల గుండా వెళ్లకపోతే మీ స్వంత బలహీనతను మీరు ఎప్పటికీ నమ్మరు. మిమ్మల్ని మోసుకెళ్లడానికి ఆయన బలం అవసరం లేకుంటే దేవుని బలాన్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు.”

“యేసును పొందేంత వరకు మీకు కావలసినదంతా యేసు మాత్రమే అని మీకు తెలియకపోవచ్చు.”

Category

Leave a Comment