సువార్తీకరణకు ఉండే సాధారణ అడ్డంకులు 2వ భాగము

Posted byTelugu Editor August 15, 2023 Comments:0

(English version: Common Barriers To Evangelism & How To Overcome Them – Part 2)

ఇదే అంశంపై మునుపటి ప్రచురణకు కొనసాగింపుగా, ఇక్కడ సువార్తీకరణకు చాలా సాధారణ అడ్డంకులు పేర్కొనబడ్డాయి.

11. నేను నమ్మేదాన్ని నమ్మేలా ఎవరినీ బలవంతం చేయకూడదని అనుకుంటున్నాను.

సత్యాలు తెలియచేయడం ప్రజలను బలవంతం చేయడం కాదు! మనం ఎవరినీ నమ్మమని బలవంతం చేయలేము [చేయకూడదు!]. ప్రభువు మాత్రమే ప్రజల హృదయాలను తెరుస్తారు.

మనకు ఏదైనా వ్యాధి వచ్చి దానికి మంచి వైద్యం దొరికినప్పుడు, అదే పరిస్థితుల్లో ఉన్నవారికి ఆ వైద్యం గురించి చెప్పడానికి తొందరపడతాము. ఎందుకు? ఎందుకంటే మనకు వారి పట్ల శ్రద్ధ ఉంది కాబట్టి! అదే విధంగా, మానవులందరూ పాపపు దోషంతో కొట్టబడ్డారు. ఈ ప్రాణాంతక వ్యాధికి యేసు మాత్రమే నివారణ. ఈ శుభవార్త మనం వారికి చెప్పకూడదా?

“నేను నా విశ్వాసాన్ని నా దగ్గరే ఉంచుకుంటాను…ఎవరైనా అడిగితే, నేను వారికి చెబుతాను,” అనే మాటలు సామాజికంగా ఆమోదయోగ్యంగా అనిపించినప్పటికీ, బైబిలుపరంగా కాదు. క్రైస్తవులు విశ్వాసాన్ని కాపాడుకోవాలి కాని కేవలం తమ కోసం మాత్రమే కాదు!

2 కొరింథి 5:20 “కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.”

క్రీస్తు లేని వారు నిత్యం బాధలు అనుభవిస్తారని మనం నిజంగా విశ్వసిస్తే, క్రీస్తు వద్దకు రావాలని మనం వారిని వేడుకుంటాము.

12. నేను నా సంస్కృతికి చెందిన వ్యక్తులకు మాత్రమే సాక్ష్యమివ్వగలను.

వారి పద్ధతులు, అలవాట్ల బట్టి మనం వారిని సులభంగా గుర్తించగలం కాబట్టి మన సంస్కృతికి చెందిన వ్యక్తులను చేరుకోవడం సులభమే. అయినప్పటికీ సువార్తీకరణను ఒక నిర్దిష్ట సంస్కృతికి మాత్రమే పరిమితం చేయకూడదు. ప్రతి జీవికి సువార్త అందించాలన్నదే ఆజ్ఞ! ప్రతి ఒక్కరికి క్రీస్తు కావాలి.

లూకా 24:47 “యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.”

విభిన్న సంస్కృతుల ప్రజలను మన మార్గాల్లో ఉంచడానికి దేవుడు ఒక కారణం కలిగి ఉన్నాడు. ఇది ప్రమాదవశాత్తు కాదు. వారి సాంస్కృతిక నేపథ్యంతో సంబంధం లేకుండా మనం వారికి సత్యాన్ని ప్రకటించాలని ఆయన కోరుకుంటున్నాడు [ఉదా., ఫిలిప్పు నుండి ఐతియొపీయుడైన నపుంసకుడు, అపొ.కా 8:26-39].

13. పంచుకోడానికి నా దగ్గర గొప్ప సాక్ష్యం లేదు.

పౌలుకు దమస్కు మార్గంలో ఎదురైన అనుభవం వంటి సాక్ష్యం తమకు లేదు కాబట్టి ఇతరులు ఆకట్టుకోలేమని చాలామంది అనుకుంటారు. ఇది తప్పు ఆలోచన. ఇక్కడ ప్రాముఖ్యత స్వయంపైనే ఉంది మరియు క్రీస్తుపై కాదు. తెలియజేయవలసిన సందేశం ఏమిటంటే, “నేను పాపంలో చనిపోయాను కానీ ఇప్పుడు నేను క్రీస్తు ద్వారా క్షమాపణను అనుభవించాను.” పరిశుద్ధాత్మ ప్రజలను రక్షించడానికి వివిధ మార్గాల్లో పనిచేస్తుంది.

యోహాను 3:8 “గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.”

14. దేవుడు ప్రజలను రక్షించాలని ముందుగా నిర్ణయించినప్పుడు సువార్తీకరణకు ఎందుకు వెనుకాడాలి?

దేవుడు అంతం నిర్దేశించడమే కాదు ఆ అంతానికి మార్గాలను కూడా నియమిస్తాడు. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు రక్షించడానికి ప్రజలను ఎన్నుకున్నప్పుడు, ఎంపిక చేయబడిన వారు రక్షించబడాలి. సువార్త విని దానికి స్పందించడం ద్వారా వారికి రక్షణ లభిస్తుంది. వారు సువార్త వినడానికి దానికి స్పందించడానికి మనం ఒక సాధనంగా ఉన్నాము. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఉపయోగించే సాధనమే సువార్తీకరణ.

అపొ.కా 13:48 “అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.”

అపొ.కా 16:14 “అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగుపొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను.”

2 తిమోతి 2:10 “అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతోకూడ క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను.”

ఎంపిక, ముందస్తు నిర్ణయం వంటి బైబిలు సత్యాలపై సరైన అవగాహన ఉండడం వలన క్రైస్తవుడు సువార్తీకరణకు దూరంగా ఉండడం కంటే దానిలో ఎక్కువ ఉత్సాహం చూపేలా ప్రేరేపిస్తుంది.

15. నేను వ్యక్తులకు సాక్ష్యమివ్వడం ప్రారంభించే ముందు వారితో నేను లోతైన స్నేహాన్ని పెంపొందించుకోవాలి.

స్నేహం ద్వారా సువార్త ప్రకటించడంలో అనేక సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, ఈ విధానంలో ప్రమాదం ఉంది: కొన్నిసార్లు ఇది కేవలం స్నేహం అవుతుంది, సువార్త కాదు. సువార్త లేకుండా సంబంధం ఎక్కువ కాలం కొనసాగిన తరువాత, క్రీస్తు కోసం మాట్లాడటానికి నోరు తెరవడం చాలా కష్టం.

16. నేను సువార్తను అందించినప్పుడల్లా, సంభాషణను క్లుప్తంగా మరియు మధురంగా ఉంచడం నాకు ఇష్టం.

మరో మాటలో చెప్పాలంటే, సువార్తీకరణను నేను పొందాను అని కాకుండా నాకు వచ్చింది అనే దృష్టితో చూడాలి. అవును, సువార్త ప్రకటించడం ఒక ఆజ్ఞ అని గ్రహించాలి. అయినప్పటికీ, అది అసౌకర్యంగా ఉన్నందుకు మనస్సాక్షిని శాంతపరచడానికి దానిని త్వరత్వరగా ముగిస్తారు. సువార్తను త్వరత్వరగా అందించడం, అవిశ్వాసి నుండి ఆగ్రహం లేదా ప్రతిఘటన వంటివి ఎదురైనప్పుడు మొదటే ఆగిపోతారు. హమ్మా! అది ముగిసినందుకు నాకు సంతోషంగా ఉంది. నేను చేయాల్సిన పని చేసేసాను!” అనుకుంటారు

మనం అవిశ్వాసిని వేధించలేము, వేధించకూడదు కాబట్టి మనం సువార్తీకరణ ఒక విధానంలో చేసుకుపోవాలి అనే ధోరణి విడిచిపెట్టాలి. అవిశ్వాసుల హృదయంలో పరిశుద్ధాత్మ పనిచేసేలా మనం చేయాలి. సువార్త అందిస్తున్నప్పుడు కొన్ని నిమిషాల నిశ్శబ్దం ఇబ్బందికరంగా ఉండవచ్చు కానీ అది చాలా ప్రభావవంతంగా ఉంటుంది! సువార్తీకరణని ఒక “ఉద్యోగం” గా పరిగణించకూడదు. తమ ప్రభువు గురించి మాట్లాడటం క్రైస్తవులకు ఆనందం కలిగించేదిగా ఉండాలి!

17. నేను ఇంట్లో మరియు పనిలో నా బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తిస్తున్నట్లయితే నేను నా క్రైస్తవ పాత్రను నెరవేరుస్తున్నాను.

ఒకరు కుటుంబంలో [మంచి భర్త, భార్య, తల్లిదండ్రులు, మొదలైనవి] పనిచేసే స్థలంలో [మంచి ఉద్యోగి, యజమానిగా ఉండటం ద్వారా] మంచి మాదిరిగా ఉండటం చాలా అవసరము. అయితే, సువార్తీకరణలో విఫలమవ్వడానికి అది సాకుగా ఉపయోగించకూడదు. మనం కొన్ని అంశాలలో విధేయత చూపించి మరికొన్ని అంశాలలో అవిధేయత చూపిస్తూ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించలేము.

18. నేను నా పనితో కుటుంబంతో తీరిక లేకుండా ఉన్నాను. క్రీస్తు కోసం సాక్ష్యమివ్వడానికి నాకు సమయం లేదు.

క్రీస్తు గురించి సాక్ష్యమివ్వడానికి మనం తీరిక లేకపోతే, మనం నిజంగానే తీరిక లేకుండానే ఉన్నాము! మనకు ఉద్యోగం ఎవరు ఇస్తారు? మన కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? మనకు వినోదాన్ని ఎవరు అందిస్తారు?మనం బహుమతులకు వాటిని ఇచ్చిన వాని కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చా?మనకు నచ్చిన లేదా చేయాలనుకుంటున్న వాటిని చేయడానికి మనందరికీ సమయం ఉంటుంది.

సమస్య తీరిక లేకపోవడం కాదు కాని సరైన ప్రాధాన్యతలను ఎంచుకోకపోవడమే. క్రీస్తు కొరకు జీవించడమే మన పని! క్రీస్తు కొరకు సాక్ష్యమివ్వడంలో విశ్వాసంగా ఉన్నవారు కుటుంబంలో ఉద్యోగరంగాలలో విశ్వాసంగానే ఉంటారు.

19. క్రైస్తవులతో బైబిలు సత్యాలను పంచుకోవడం నాకు సులభమే కాని క్రైస్తవేతరులతో కాదు.

పరలోకంలో, మనం ఒకరితో ఒకరు చాలా సహవాసాన్ని పంచుకుంటాము! అయితే, భూమిపై ఉన్నప్పుడు మనకు సువార్తీకరణ పనివుంది. తోటి క్రైస్తవులతో బైబిలు విషయాలను చర్చించడం సులభమే అది చాలా సౌకర్యవంతంగా ఆనందంగా ఉంటుంది. ఒకే రకం ఈక ఉన్న పక్షులు గుంపులుగా కలిసివుంటాయి కదా అలాగే ఇతర క్రైస్తవుల సహవాసం కీలకమైనది దాని గురించి ఆజ్ఞ కూడా ఇవ్వబడింది [హెబ్రీ 10:24-25]. కాబట్టి మనం కూడా మన కంఫర్ట్ జోన్ నుండి బయటవచ్చి బయటి ప్రపంచంతో క్రీస్తు గురించి పంచుకోవాలి. అదే ఆజ్ఞ కూడా [అపొ.కా1:8]!

20. నేను వేరే ప్రదేశానికి వెళ్లి మిషనరీగా సువార్తను పంచుకుంటాను.

దేవుడు ఎక్కడికి పిలుస్తారో అక్కడికి వెళ్లడానికి ఇష్టపడటం చాలా మంచిది. అయితే, ఇప్పుడున్న ప్రదేశంలో క్రీస్తును సాక్ష్యమివ్వడానికి ఒకరు నోరు తెరవకపోతే, మరొక ప్రాంతంలో నోరు తెరుస్తారనే నమ్మకం ఉందా?

అంతే కాకుండా, మనం ఉన్న చోటే క్రీస్తు కోసం సాక్ష్యమివ్వమని మనకు ఆజ్ఞ ఇచ్చారు. అప్పుడు మాత్రమే మనం మరొక ప్రదేశంలో నమ్మకంగా ఉండగలము. మన అవిధేయతను మరొక ప్రదేశానికి ఎందుకు తీసుకువెళ్ళాలి?

21. నేను పాపంలో జీవిస్తున్నాను కాబట్టి నేను క్రీస్తుకు సాక్షిగా ఎలా ఉండగలను?

ఒకరి జీవితంలో పాపాన్ని గుర్తించడం అదే సమయంలో క్రీస్తు కోసం సాక్ష్యమిచ్చేటప్పుడు కపటంగా భావించడం మంచిదే కాని ఇంకా పాపస్థితిలోనే జీవించడం మంచిది కాదు. హానికగించే పాపాన్ని మనం దూరంగా ఉంచి సువార్తీకరణ కొనసాగించాలి. శరీరానుసారంగా జీవించినంత కాలం మనం ఎప్పటికీ పరిపూర్ణంగా ఉండలేము. అయినప్పటికీ, పాపంలో జీవించడం తద్వారా సువార్తీకరణకు దూరంగా ఉండటానికి ఒక సాకు కాదు.

ఒకరు చూడగలిగినట్లుగా, జాబితా సమగ్రంగా ఉంటుంది. అయితే చివరి మాట ఏమిటంటే, సువార్త పరిచర్య చేయకపోవడానికి కారణం ఏదైనప్పటికీ, క్రీస్తుకు సాక్ష్యమివ్వడంలో విఫలమవ్వడం అంటే పాపమే! మనం ఈ సత్యంతో పట్టుకోకపోతే సువార్తీకరణ గురించి మనం ఎప్పుడూ ప్రార్థించము. కేవలం సువార్తీకరణ ఒక్కటే చేస్తాము.

కాబట్టి, ఈ సత్యాల గురించి ఆలోచించడానికి కొన్ని నిమిషాలు వెచ్చిద్దాము. మన వైఫల్యాలను సరైనరీతిలో గుర్తించి, వాటిని అధిగమించడంలో సహాయం చేయమని దేవుని కోరుకుందాము. అప్పుడు మాత్రమే నమ్మకమైన సాక్షిగా ఉండాలనే ఆజ్ఞను నెరవేర్చడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడని మనం ఆశించవచ్చు.

సువార్తీకరణకు సంబంధించి “ది గాస్పెల్ అండ్ పర్సనల్ ఎవాంజెలిజం” అనే తన పుస్తకంలో మార్క్ డెవర్ వ్రాసిన క్రింది మాటలు మీరు నమ్మకంగా విత్తనాలు విత్తుతున్నప్పటికీ మంచి ఫలితాలను చూడలేనప్పుడు మీకు ఓదార్పునిస్తాయి:

సువార్తీకరణ చేయమని క్రైస్తవులకు ఇచ్చిన పిలుపు కేవలం నిర్ణయాలు తీసుకునేలా ప్రజలను ఒప్పించమని కాదు కానీ వారికి క్రీస్తులో రక్షణకు సంబంధించిన శుభవార్తను ప్రకటించి వారు పశ్చాత్తాపం చెంది మార్పు చెంది నూతనంగా జన్మించినందుకు దేవుని మహిమ చెల్లించడానికే. మారని వ్యక్తికి మనం నమ్మకంగా సువార్తను చెబితే మన సువార్తీకరణలో విఫలమవ్వము; సువార్తను నమ్మకంగా చెప్పకపోతేనే మనం విఫలమవుతాము.

Category

Leave a Comment