22 విషయాలలో మనల్ని మనం పరీక్షించుకుందాము

(English version: “Come, Let Us Examine Ourselves in 22 Areas”)
ప్రతి క్రైస్తవుని జీవితంలో కోరుకోవలసిన, అనుసరించవలసిన మరియు ఉండవలసిన 22 లక్షణాల జాబితాను పౌలు కొలస్సి 3:1-4:6లో తెలియచేశాడు. కొంత సమయాన్ని వెచ్చించి ఈ ప్రతి విషయంలో మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుందాం. అవసరమైన చోట మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకుని, పశ్చాత్తాపం చెందడానికి వాటిని సరిదిద్దడానికి సహాయం చేయమని ఆయనను అడుగుదాము.
1. లోకము [కొలస్సి 3:2 “పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి.”]
2. లైంగిక పవిత్రత [కొలస్సి 3:5 “జారత్వమును, అపవిత్రతను, కామాతురతను…చంపివేయుడి”]
3. దురాశ [కొలస్సి 3:5 “దురాశను చంపివేయుడి”]
4. కోపం [కొలస్సి 3:8 “మీరు కోపమును విసర్జించుడి.”]
5. చెడ్డమాటలు [కొలస్సి 3:8-9 “మీరు దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి; ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి.”]
6. పక్షపాతం [కొలస్సి 3:11 “ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు.”]
7. దయ [కొలస్సి 3:12 “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును ధరించుకొనుడి.”]
8. వినయం [కొలస్సి 3:12 “మీరు వినయమును, సాత్వికమును ధరించుకొనుడి.”]
9. దీర్ఘశాంతము [కొలస్సి 3:12 “మీరు దీర్ఘశాంతమును ధరించుకొనుడి.”]
10. క్షమాపణ [కొలస్సి 3:13 “ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి”]
11. ప్రేమ [కొలస్సి 3:14 “ప్రేమను ధరించుకొనుడి”]
12. కృతజ్ఞతలు [కొలస్సి 3:15-16 “కృతజ్ఞులై యుండుడి బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానముచేయుడి”]
13. వాక్య ధ్యానము [కొలస్సి 3:16 “సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి”]
14. భార్యలు [కొలస్సి 3:18 “మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది”]
15. భర్తలు [కొలస్సి 3:19 “మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి”]
16. పిల్లలు [కొలస్సి 3:20 “అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి;”]
17. తల్లిదండ్రులు [కొలస్సి 3:21 “మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.”]
18. ఉద్యోగులు [కొలస్సి 3:23 “ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి.”]
19. యజమానులు [కొలస్సి 4:1 “న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులయెడల చేయుడి.”]
20. ప్రార్థన (సాధారణ) [కొలస్సి 4:2 “ప్రార్థనయందు నిలుకడగా ఉండుడి.”]
21. ప్రార్థన (సువార్తను వ్యాప్తి చేయడం కోసం) [కొలస్సి 4:3-4 “క్రీస్తు మర్మమునుగూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు …. ప్రార్థించుడి.”]
22. సువార్తీకరణ [కొలస్సి 4:5-6 “సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి; మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.”]
“యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును” [1 యోహాను 1:7] మరియు “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన మన పాపములను క్షమించి, సమస్త దుర్నీతి నుండి మనలను శుద్ధి చేయుటకు నమ్మకమైనవాడు మరియు నీతిమంతుడు.” [1 యోహాను 1:9] అని జ్ఞాపకం ఉంచుకోండి.