రూపాంతరం చెందిన జీవితము 16వ భాగము మనల్ని బాధపెట్టిన వారికి ఎలా స్పందించాలి

(English version: “The Transformed Life – How To Respond To Those Who Hurt Us”)
“17 కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి యుండుడి. 18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. 19 ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది. 20 కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహ మిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. 21 కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము” అనే మాటలతో రోమా 12వ అధ్యాయం ముగుస్తుంది.
పరిశుద్ధాత్మ చెందించే రూపాంతరం కారణంగా మరి ఎక్కువగా యేసుక్రీస్తు వలె కనిపించే జీవనశైలి కలిగివుండాలని విశ్వాసులకు పిలుపునివ్వడమనే [రోమా 12:1-2] ప్రధాన అంశాన్ని కలిగిన రోమా 12వ అధ్యాయానికి ఇది ఎంతో సముచితమైన ముగింపు.
యేసు భూమి మీద జీవించిన కాలమంతా తనను బాధపెట్టినవారి తీర్పులన్నిటిని దేవుని చేతికి అప్పగించి ఆయన వారికి మంచి మాత్రమే చేయడాన్ని మనం చూస్తాము. ఈ వచనాలలో చెప్పిన ప్రకారం మనం ఖచ్చితంగా చేయవలసింది అదే: మనల్ని బాధపెట్టే వారిపై ప్రతీకారం తీర్చుకోకపోవడమే కాకుండా తీర్పులన్నిటిని దేవుని చేతికి అప్పగించి వారికి మనం మేలు చేయాలి.
ఈ వచనాలలో, ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు మనం చేయవలసిన మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఇవ్వబడ్డాయి: 1. ప్రతీకారం తీర్చుకోవద్దు 2. అందరికీ మేలు చేయండి 3. తీర్పులన్నిటిని దేవుని చేతికి అప్పగించాలి. వాటిలో ప్రతి ఒక్కదానిని వివరంగా చూద్దాం.
మనం దీనిని వచనం తర్వాతి వచనంగా కాకుండా వచనాలన్నిటిని కలిపి వచనాలలో భాగాలు తీసుకుని ప్రతి అంశాన్ని చూద్దాము. అవే సత్యాలు పునరావృతమయ్యాయని మీరు గమనిస్తారు. వాటిని ఈ విధంగా అమర్చడం మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది.
1. ప్రతీకారం తీర్చుకోవద్దు.
“ 17 కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు…, 19 ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక…, 21 కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.” [రోమా 12:17, 19, 21] వచనాలలో ఈ ఆజ్ఞ ఉంది. ఈ నియమాన్ని పౌలు మాత్రమే కాకుండా, అపొస్తలుడైన పేతురు కూడా చెప్పాడు, “కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి” [1 పేతురు 3:9].
ప్రతీకారం తీర్చుకోకూడదనే ఈ నియమం పాత నిబంధనలో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు లేవీ 19:18లో “కీడుకు ప్రతికీడుచేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను” అని వ్రాయబడింది. సొలొమోను కూడా “వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెదననుకొనకుము” [సామెతలు 24:29] అనే మాటలతో మనలను హెచ్చరించాడు.
ఈ వచనాలన్నిటిని బట్టి క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా సరే మనల్ని బాధపెట్టే వారిపై ప్రతీకారం తీర్చుకోకూడదని దేవుడు మనకి చెబుతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ప్రతీకారం చేయకూడదు అంటే ప్రతీకారం చేయకూడదు, అది ఇంటిలోనైనా చర్చిలోనైనా లేదా మరే ఇతర ప్రదేశంలోనైనా సరే. మన పాప స్వభావాలు ప్రతికారం చేయమని మనల్ని ప్రేరేపించినప్పటికీ, దేవుడు ఏ ప్రతీకారాన్ని వద్దన్నాడు. దెబ్బకు దెబ్బ అనే మనస్తత్వం వద్దు. నిశ్శబ్దం, వ్యంగ్య లేదా కోపం నిండిన మాటలు, నిర్దయగా తిరస్కరణ, తలుపులు కొట్టడం, పుకారులు, అపవాదు మొదలైన హింసాత్మకమైన అహింసా ప్రతీకార చర్యలు చేయకూడదు. మనం ఎంత తీవ్రంగా గాయపడినా కొంచెం ప్రతీకారమైనా తీర్చుకోకూడదు అనే ఆదేశం స్పష్టంగా ఉంది.
అయితే ఈ ఒక్క ఆజ్ఞతోనే దేవుని వాక్యం ఆగిపోలేదు. మనం ప్రతీకారం తీర్చుకోకపోవడమే కాకుండా మనల్ని బాధపెట్టిన వారికి మేలు చేసేవారిగా ఉండాలని కూడా చెప్పారు. ఈ వాక్యభాగం మనకు బోధించే 2వ విషయం ఇదే.
2. అందరికీ మేలు చేయండి.
“మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి” [రోమా 12:17] అని పౌలు చెప్పాడు. మనం ప్రజల దృష్టిలో సరైన వారిగా ఉండడానికి దేవుని నైతిక నియమాలను ఉల్లంఘించవచ్చని దీని అర్థం కాదు. అయితే మనం అందరి దృష్టిలో గౌరవప్రదమైన పనిని కొనసాగించాలి. చాలా వరకు, చెడుకు ప్రతిగా మంచి చేయడం అవిశ్వాసుల దృష్టిలో కూడా ఆమోదం పొందుతుందనేది పౌలు యొక్క ఉద్దేశము.
“శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి” [రోమా 12:18] అని చెప్పాడు. వీలైనంత వరకు, విశ్వాసులు బైబిలు ఆదేశాలతో రాజీ పడకుండా సమాధానంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అంతేకాకుండా మన నాయకుడిని సమాధానాధిపతి అని [యెషయా 9:6] మనల్ని సమాధానపరిచేవారని [మత్తయి 5:9] పిలుస్తారు. కాబట్టి మనం సాధ్యమైనంతవరకు సమాధాన్ని కోరుకోవడమే సరైనది.
అయితే పౌలు ఒక యథార్ధవాది. కొందరితో సమాధానంగా ఉండలేని సందర్భాలు ఉంటాయని అతడికి తెలుసు. యేసు కూడా పరిసయ్యులతో సామరస్యంగా జీవించలేకపోయాడు! అందుకే పౌలు “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు” అనే మాటలు చేర్చాడు. అంతే కాకుండా “నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు” [రోమా 12:20] అని చెప్పాడు. 20వ వచనం అనేది సామెతలు 25:21-22 నుండి ఉటంకించబడింది. మనల్ని బాధపెట్టే వారికి మేలు చేయాలనే స్పష్టమైన ఆదేశం ఇక్కడ ఉంది. ఆహారం నీరు జీవించడానికి కావలసిన ప్రాధమిక అవసరాలు. మిమ్మల్ని బాధించినవారికి వారికి తగినవి కాకుండా వారికి అవసరమై వాటినే ఇవ్వాలనే ఆలోచన దీనిలో ఉంది . “అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు” అనే మాటలు మిమ్మల్ని బాధించినవారికి వారు చేసిన పనులకు తీవ్రంగా సిగ్గుపడేలా చేసే శక్తి వారి పట్ల మనం చూపించే ప్రేమకు ఉందని సూచిస్తుంది, వారు విశ్వాసంతో దేవుని వైపు తిరిగేలా చేస్తుంది.
చివరగా, ఇతరుల చెడు మనపై ఆధిపత్యం చెలాయించకూడదని మరోసారి చెప్పబడింది, కానీ మన మేలుతో వారి చెడును జయించాలని “మంచితో చెడును జయించండి” [రోమా 12:21] అనే ఆజ్ఞ తెలియజేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, మనల్ని బాధపెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోకుండా వారికి మేలు చేసే మార్గాలను వెతకాలి.
లూకా 6:27-28లో యేసు అదే విషయాన్ని చెప్పారు: “27 వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలుచేయుడి, 28 మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి.” 1 థెస్సలొ 5:15 మరియు 1 పేతురు 3:9 వంటి ఇతర వాక్యాలు కూడా అదే ఆలోచనను నొక్కి చెబుతున్నాయి.
పాత నిబంధన గ్రంథంలోని ఆదికాండములో యోసేపు గుర్తుకు వస్తాడు కదా? అతడు తనను బానిసగా అమ్మివేసిన తన అన్నలపై పగతీర్చుకోలేదు కానీ చాలాకాలం తరువాత వచ్చిన కరువు సంవత్సరాలలో వారికి మేలు చేయడానికి ఎంతగానో ప్రయత్నించాడు. మనం కూడా అలా చేయడానికి పిలువబడ్డాము. ప్రతీకారం తీర్చుకునే మన ధోరణులను అధిగమించి మనల్ని బాధపెట్టిన వారికి మంచి చేయడానికి ప్రయత్నించాలి.
మనం చేయవలసింది ఇంకా పూర్తి కాలేదు. ఈ రెండూ చాలా కష్టమని మీరు అనుకుంటే, పౌలు చెప్పిన మరో విషయం ఇంకా కష్టతరంగా ఉంటుంది.
3. తీర్పులన్నిటిని దేవుని చేతికి అప్పగించాలి.
19వ వచనంలో మనం ప్రతీకారం తీర్చుకోకూడదని చెప్పిన తర్వాత, “దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని” వ్రాయబడి యున్నది [రోమా 12:19] అని పౌలు అన్నాడు. అతడు ద్వితియో 32:35ని ఉటంకించాడు, తన ప్రజలను హింసించే వారిపై దేవుడు తగిన కాలంలో తీర్పు తీరుస్తాడనే సత్యాన్ని గ్రహించి విశ్రాంతి తీసుకుని సంతోషించమని మోషే ఇశ్రాయేలీయులను ప్రోత్సహించాడు. సొలొమోను కూడా అదే విషయాన్ని సామెతలు 20:22లో “కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును” అని చెప్పాడు.
తీర్పును మన చేతుల్లోకి తీసుకోకూడదని దీని అర్థము. ఆయన సమయంలో మరియు ఆయన మార్గంలో తీర్పును అమలు చేయడానికి మనం హృదయపూర్వకంగా దేవునిపై నమ్మకం ఉంచాలి. తీర్పు దేవునికి మాత్రమే చెందినది, ఆయనకు చెందినది తీసుకునే ధైర్యం మనం చేయకూడదు. మనం అసహనానికి గురై మనల్ని బాధపెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటూ, “దేవా, మీరు సరిగ్గా తీర్పు ఇస్తారని నేను ఖచ్చితమైన విశ్వాసం కలిగి లేను” అంటాము. అలాంటి ప్రవర్తన దేవునికి నచ్చదు. ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పిన దేవుడిపై ఉన్న అవిశ్వాసానికి ఇది సంకేతము. నిజమైన విశ్వాసం దేవుడు ఇచ్చిన మాటకు కట్టుబడి, మనల్ని బాధపెట్టే వారికి ఆయన తీర్పు తీర్చే వరకు ఆయన కోసం వేచి ఉంటుంది.
మనల్ని బాధపెట్టినవారు పశ్చాత్తాపపడితే మనం వెంటనే వారిని క్షమించాలి. మన ప్రభువు లూకా 17:3-4 లో చాలా స్పష్టంగా చెప్పారు, “నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము. 4 అతడు ఒక దినమున ఏడుమారులు నీ యెడల తప్పిదము చేసి యేడుమారులు నీవైపు తిరిగి మారుమనస్సు పొందితిననిన యెడల అతని క్షమింపవలెననెను.” ఈ వచనాల ప్రకారం మనకు వ్యతిరేకంగా పాపం చేసేవారిని మనం గద్దించాలి, వారు నిజంగా పశ్చాత్తాపపడితే వారిని క్షమించాలి. దేవుని వాక్యం స్పష్టంగా ఉంది.
దీనితో పాటు, మనం పూర్తి సయోధ్యని కూడా కోరుకోవాలి. క్షమించిన తర్వాత కొంత దూరాన్ని పాటించడమనే తప్పు మనం చేస్తుంటాము. అది సయోధ్య అనే క్షమాపణ యొక్క ఉద్దేశ్యాన్ని పాడుచేస్తుంది. దేవుడు క్షమించినప్పుడు ఆయన ఎప్పుడూ మనల్ని తిరిగి తనతో సమాధానపరచుకుంటారు [కొలస్సి 1:22; 2 కొరింథి 5:17-19]. అవతలి వ్యక్తి సయోధ్యను కోరుకోకపోయినా మనం కూడా దీనిని కొనసాగించాలి!
క్షమాపణ కోరే వ్యక్తికి ఒక మాట: మనమే బాధపెట్టినవారమైతే మనం వెళ్లి నేను చేసిన దానికి నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణ అడగడమే కాకుండా వారితో సయోధ్య కోసం కూడా మనం ప్రయత్నించాలి. కొన్నిసార్లు మనకు మంచిగా ఉండాలని లేదా దూరంగా ఉండాలని క్షమించండని చెబుతాము; అది సరైన వైఖరి కాదు.
క్షమాపణ కోరడం మరియు ఇవ్వడంలో ఉన్న అంతిమ లక్ష్యం సయోధ్య. ఎదుటి వ్యక్తి దానిని కొనసాగించాలా వద్దా అనేది మన చేతుల్లో లేదు. మనం క్షమాపణ కోరేవారమైనా లేదా పశ్చాత్తాపపడేవారిని క్షమించేవారమైనా సరే పూర్తి సయోధ్య కోసం మనం చేయగలిగినదంతా చేయాలి.
మనల్ని బాధపెట్టినవారు పశ్చాత్తాపపడనప్పుడు ఎలా స్పందించాలి?
మనల్ని బాధపెట్టే వారు పశ్చాత్తాపపడకపోతే ఏమిచేయాలి? తప్పు చేశామని వారు గ్రహించకపోతే ఏమి చేయాలి? అలాంటప్పుడు వారిని కూడా మనం క్షమించాలా? మనం చేయాల్సిన పని ఇదేనని చాలామంది భావిస్తారు. మనం అందరినీ క్షమించాలి కదా? సిలువపై ఉన్నప్పుడు యేసే స్వయంగా తన శత్రువులను క్షమించలేదా? అంటారు. ఈ ప్రశ్నలను నిశితంగా పరిశీలిద్దాం.
నేరస్థుడు పశ్చాత్తాపపడినా పడకపోయినా మనం ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోకూడదని మేలు చేయడానికే ఎప్పుడూ ప్రయత్నించాలని మొదటిగా మీకు గుర్తు చేస్తున్నాను. అయితే క్షమాపణ విషయానికి వస్తే అది వేరే విషయము.
ఇక్కడ పౌలు, ద్వితీయోపదేశకాండాన్ని ఉటంకిస్తూ తీర్పును దేవుని చేతికి అప్పగించాలని చెప్పడం ద్వారా పశ్చాత్తాపపడని వారు తీర్పును ఎదుర్కొంటారని, వారు పశ్చాత్తాపపడకుండా అలానే ఉంటే నరకాన్ని కూడా చేరుకుంటారని చెప్పాడు. క్రీస్తులా ఉండాలంటే దేవుని అనుకరించాలంటే, దేవుడు క్షమించినట్లే మనం కూడా క్షమించాలి. సరియైనదే కదా? అందుకే మనం ఈ ప్రశ్న వేసుకోవాలి:
దేవుడు అందరినీ క్షమిస్తాడా లేదా పశ్చాత్తాపపడేవారిని మాత్రమే క్షమిస్తాడా?
ఆయన ప్రతి ఒక్కరినీ బేషరతుగా క్షమిస్తాడని మనం చెబితే, అప్పుడు అందరూ పరలోకానికే వెళ్తారు. అది సార్వత్రికవాదమే కాని బైబిలు బోధించేది కాదు.
మనం పశ్చాత్తాపపడకపోతే నశిస్తామని లూకా 13:3 మరియు లూకా 13:5లో యేసు స్వయంగా రెండుసార్లు చెప్పారు. పశ్చాత్తాపం లేకపోతే క్షమాపణ ఉండదు. నిజానికి, పాపాల కోసం పశ్చాత్తాపం చెందమని పాత మరియు కొత్త నిబంధనలలో పిలుపు ఇవ్వబడింది. పశ్చాత్తాపపడని వారు పరలోక వారసులు కాలేరు. పశ్చాత్తాపపడి విశ్వాసంతో తన కుమారుని వైపు తిరిగేవారిని మాత్రమే దేవుడు క్షమిస్తాడనేది ముగింపు.
సిలువపై పశ్చాత్తాపపడిన నేరస్థుడిని క్షమించిన అదే యేసు ఇతరులను కూడా క్షమించగలరు. యేసుకు భూమిమీద పాపాలను క్షమించే అధికారం ఉందని [మత్తయి 9:6] అలాగే అనేకమందిని క్షమించారని గుర్తుంచుకోండి. కానీ సిలువపై, తండ్రీ, వారిని క్షమించు [లూకా 23:34] అనే ఆయన మాటలకు అందరినీ క్షమించారని కాదు. ఇది వారిని క్షమించమని దేవునికి ప్రార్థన మాత్రమే, అంటే వారు దేవుని వైపు తిరగడానికి, వారి పాపాల గురించి పశ్చాత్తాపపడి క్రీస్తుపై విశ్వాసం ఉంచడానికి మరియు క్షమాపణను అనుభవించడానికి ప్రేరేపించబడవచ్చు. వారు పశ్చాత్తాపపడలేదు కాబట్టి యేసు వారిని స్వయంగా క్షమించలేదు. యేసు సిలువపై ఉన్న ఒక వ్యక్తిని అనగా నిజంగా పశ్చాత్తాపపడిన ఆ దొంగని మాత్రమే క్షమించారు [లూకా 23:42]. స్తెఫనును రాళ్లతో కొట్టినప్పుడు, ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని ప్రార్థించాడు [అపొ.కా 7:60]. అతడు వారిని క్షమించలేదు కానీ యేసు వారిని క్షమించాలని ప్రార్థించాడు. అతడిని హింసించినవారిలో ఒకడైన సౌలు కూడా [అంటే పౌలు] దమస్కు వెళ్లే మార్గంలో పశ్చాత్తాపపడేంత వరకు క్షమించబడలేదు!
రోమా పత్రిక వ్రాసిన అదే పౌలు ఇతర చోట్లు ఈ ఆజ్ఞలను కూడా వ్రాసాడు:
“క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి” [ఎఫెసి 4:32].
“ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి” [కొలస్సి 3:13].
పైన పేర్కొన్న వాక్యాలలో ప్రభువు క్షమించినట్లు క్షమించడం అనే మాటలు ఉన్నాయి. పశ్చాత్తాపం లేకుండా ప్రభువు క్షమించడు!
కాబట్టి, క్షమాపణ విషయంలో మనం దేవుని అనుకరించాలంటే, నిజమైన పశ్చాత్తాపం ఉన్నప్పుడే మనం కూడా క్షమించగలము. మనం ఎల్లప్పుడూ క్షమించడానికి సిద్ధంగా ఉండాలి మరియు సిద్ధంగా ఉండాలి , తద్వారా సయోధ్యకు తలుపులు తెరిచి ఉంచాలి. కానీ పశ్చాత్తాపం లేనప్పుడు మనం క్షమాపణ చెప్పలేము. మనం అలా చేస్తే, ఈ విషయంలో మనం దేవుని అనుకరించడంలో విఫలమవుతాము. పశ్చాత్తాపపడని వారు పరలోకంలో ప్రవేశించరనే సత్యాన్ని చెప్పి పశ్చాత్తాపపడని వారిని దేవుని తీర్పు గురించి హెచ్చరించడంలోనూ విఫలమవుతాము.
నిజానికి, ద్వేషం మరియు పగలు మనల్ని నియంత్రించడానికి అవకాశం ఇవ్వకూడదు. కానీ పశ్చాత్తాపం లేని చోట క్షమాపణ ఇవ్వడం బైబిలుకు విరుద్ధం అని కూడా అంతే నిజము. ప్రతీకారం తీర్చుకోకపోవడం, మనల్ని బాధపెట్టినవారికి మేలు చేయడం మరియు వారిని క్షమించడంతో సమానంగా వారిని దేవుని చేతికి అప్పగించడం గురించి మనం గందరగోళానికి గురికాకూడదు. అవి వేరు వేరు విషయాలు.
మనం క్షమించకపోతే మనలో ద్వేషం ఉన్నట్లే అని గందరగోళానికి గురికాకూడదు; నేను క్షమించాలి లేదా ద్వేషించాలి; అది నిజం కాదు. మనం ఏదో ఒకటే చేయాలి లేదా ఒక పక్షంగానే ఉండగలం అని ధోరణి ఉండకూడదు. పశ్చాత్తాపం లేనప్పుడు మనం క్షమించలేము అదే సమయంలో ద్వేషించకూడదు అదే మనకిచ్చిన పిలుపు. మనం కూడా ఎప్పుడూ క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ స్ఫూర్తిని మనం పెంపొందించుకోవాలి.
అవును, పశ్చాత్తాపం లేని చోట, మన హృదయాలు ద్వేషపూరితంగా మారకుండా కాపాడుకోవడానికి పోరాడాలి. కానీ పరిశుద్ధాత్మ శక్తి సహాయంతో మన హృదయాలు ద్వేషపూరితంగా మారకుండా కాపాడుకోవడానికి మనం ప్రార్థించి లేఖనాలను ధ్యానిస్తూ ఉండాలి. ఇది ఒక పోరాటం—కొన్ని సందర్భాలలో ఇది జీవితకాలం పాటు ఉంటుంది. అయినప్పటికీ, తీర్పును మన చేతుల్లోనికి తీసుకోకూడదు. మనం దానిని న్యాయవంతుడైన మన దేవుని చేతికి అప్పగించాలి, ఆయన ఏ తప్పు చేయలేడు [ద్వితీయో 32:4]! అదే సమయంలో మనల్ని బాధపెట్టిన వారికి వీలైనంత మేలు చేస్తూనే ఉండాలి.
మరో మాటగా, జనులు మనకు వ్యతిరేకంగా చేసే ప్రతి చిన్న పాపానికి పశ్చాత్తాపం చెందాలని నేను చెప్పడం లేదు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోవాలి. ఇతరుల బలహీనతలను సహించడం క్రైస్తవ పరిపక్వతలో భాగము. ఎందుకంటే మనం కూడా కొన్నిసార్లు విఫలమవుతాము. పాపం తీవ్రమైనది అయినప్పుడు దానిని చేసిన వారు పశ్చాత్తాపం చెందడానికి మనం ప్రేమగా ప్రయత్నించాలి.
కాబట్టి, మనం తీర్పులన్నిటిని దేవుని చేతికి అప్పగించినప్పుడు మనం క్షమించటానికి సిద్ధంగా ఉండాలి ద్వేషానికి లొంగకుండా ఉండాలి. ఈ వాక్యభాగంలో పౌలు మనం చేయాలని చెప్పిన మూడవ విషయం ఇదే.
మనం ముగించే ముందు మనల్ని బాధపెట్టిన వారికి ప్రతిస్పందనగా మనం చేయవలసిన మూడు విషయాలను గుర్తుచేసుకుందాం:
1. ప్రతీకారం తీర్చుకోవద్దు
2. అందరికీ మేలు చేయండి మరియు
3. తీర్పులన్నిటిని దేవుని చేతికి అప్పగించాలి.
అంతిమంగా క్రీస్తులా ఉండటం అంటే అదే, ఎందుకంటే “ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను” [1 పేతురు 2:23]. మరియు అన్నింటి కన్నా, యేసు తన శత్రువులకు వారి పాపాలకు మూల్యాన్ని చెల్లించి అత్యంత మేలు చేస్తున్నారు! మనల్ని క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చగల శక్తి ఉన్న పరిశుద్ధాత్మపై ఆధారపడటం ద్వారా ఆయనను అనుకరించటానికి ప్రయత్నిద్దాము.