ప్రార్థన యొక్క 12 ప్రయోజనాలు

(English Version: 12 Benefits of Prayer)
1. ప్రార్థన దేవుని వాక్యం పట్ల అవగాహనను పెంపొందిస్తుంది.
కీర్తన 119:18 “నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము.
2. ప్రార్థన పరిశుద్ధతను పెంపొందిస్తుంది.
మత్తయి 26:41 “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము.”
3. ప్రార్థన వినయాన్ని పెంపొందిస్తుంది.
జెఫన్యా 2:3 “దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రతదినమున మీరు దాచబడుదురు.”
4. ప్రార్థన సువార్త ప్రచారాన్ని ప్రోత్సహిస్తుంది.
మత్తయి 9:37-38 “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని (యేసు)తన శిష్యులతో చెప్పెను.”
కొలస్సి 4:3 “వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మాకొరకు ప్రార్థించుడి.”
5. ప్రార్థన పరిచర్యను పెంపొందిస్తుంది.
అపో.కా 13:1-3 “అంతియొకయలోనున్న సంఘములో ……. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి.”
6. ప్రార్థన సువార్త వ్యాప్తిని ప్రజల రక్షణను పెంపొందిస్తుంది.
2 థెస్సలొ 3:1 “తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తమును, మేము మూర్ఖులైన దుష్టమనుష్యుల చేతిలోనుండి తప్పింపబడు నిమిత్తమును, మాకొరకు ప్రార్థించుడి.”
7. ప్రార్థన పట్టుదలను పెంపొందిస్తుంది.
2 కొరింథి 12:7-10 “ …… నాకు శరీరములో ఒకముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను. 8అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. 9అందుకు–నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ……. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.”
8. ప్రార్థన దేవుని పట్ల మరియు మన జీవితంలో దేవుని ఉద్దేశం పట్ల లోతైన అవగాహన పెంపొందిస్తుంది.
ఎఫెసి 1:15-19 “మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.”
9. ప్రార్థన ప్రభువైన యేసుకు మన పట్ల ఉన్న ప్రేమ పట్ల లోతైన అవగాహన పెంపొందిస్తుంది.
ఎఫెసి 3:15-19 “ ……. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతోకూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.”
10. ప్రార్థన సాతానును ఎదిరించే శక్తిని పెంపొందిస్తుంది.
యాకోబు 4:7-8 “కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.”
11. ప్రార్థన క్షమాపణా గుణాన్ని పెంపొందిస్తుంది.
మత్తయి 6:12 “మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.”
12. ప్రార్థన మన హృదయాలలో సమాధానాన్ని పెంపొందిస్తుంది.
ఫిలిప్పీ 4:6-7 “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.”
వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలను కూడా చేర్చవచ్చును. అయితే మనం వ్యక్తిగతంగాను లేదా సంఘంగాను “యెడతెగక ప్రార్థనచేయడానికి” (1 థెస్సలొ 5:17) ఇవి సరిపోతాయి.