పాపపూరిత కోపం—అది సృష్టించే వినాశనం 1వ భాగము—పరిచయం

Posted byTelugu Editor December 24, 2024 Comments:0

(English version: “Sinful Anger – The Havoc It Creates (Part 1)”)

కోపం గురించి మరిముఖ్యంగా పాపపూరిత కోపం అనే అంశం గురించి మేము బ్లాగ్ పోస్ట్‌ల సిరీస్‌ని ప్రారంభిస్తున్నాము. అన్యాయమైన కోపమనేది ఎంత ప్రబలమైన పాపమంటే క్రైస్తవులు కూడా దానివలన నిత్యం ప్రభావితమవుతూ ఉంటారు. అదుపులేని కోపం వలన కుటుంబాలలో అలాగే సంఘాలలో సంబంధాలు విపరీతంగా ప్రభావితమవుతాయి. 

బైబిలులోని మొదటి హత్యకు కారణం కోపమే; కయీను తన సోదరుడైన హేబెలును హత్య చేశాడు! దేవుడు హేబెలు అర్పణను అంగీకరించి కయీను అర్పణను తిరస్కరించినప్పుడు “కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తనముఖము చిన్నబుచ్చుకొన్నాడని బైబిలు మనకు తెలియచేస్తుంది [ఆది 4:5]. కోపం వల్ల కలిగే ప్రమాదాల గురించి దేవుడు అతడిని హెచ్చరించాడని కూడా బైబిలు తెలియచేస్తుంది, “…నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? 7 నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను [ఆది 4:6-7]. ఈ స్పష్టమైన హెచ్చరిక చేసినప్పటికి, అదుపు చేసుకోలేని తన కోపం కారణంగా కయీను హేబెలును హత్య చేశాడు. ఇలాగే కోపం ఎంతో విధ్వంసాన్ని సృష్టిస్తుంది.

నిజానికి పాపపూరిత కోపాలన్ని హత్యకు దారితీయనప్పటికీ, మత్తయి 5:22లో “తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అని యేసు చెప్పిన మాటలు ఈ పాపపూరిత కోపం గురించి మనం తీవ్రంగా పరిగణించాలని మనకు తెలియచేస్తున్నాయి. కాబట్టి ఈ పాపపూరిత కోపాన్ని బైబిలుపరంగా ఎదుర్కోవడంలో ఈ బ్లాగ్ పోస్ట్‌ల సీరీస్ మనకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను.

రాబోయే పోస్ట్‌లలో, పాపపూరిత కోపానికి సంబంధించిన 6 విషయాలను మనం పరిశీలిస్తాము:

1. కోపం అంటే ఏమిటి?

2. పాపపూరిత కోపానికి మూలం ఏమిటి?

3. పాపపూరిత కోపం యొక్క లక్ష్యం ఎవరు?

4. పాపపూరిత కోపంలో కనిపించే సాధారణ వ్యక్తీకరణలు ఏమిటి?

5. పాపపూరిత కోపం యొక్క విధ్వంసక పరిణామాలు ఏమిటి?

6. పాపపూరిత కోపం నుండి మనం ఎలా విడుదల పొందగలం?

ఈ పోస్ట్లో మనం ఈ అంశం యొక్క పరిచయాన్ని చూస్తాము.

గత కొన్ని సంవత్సరాలలో పిచ్చి పిచ్చి విషయాలపై భయంకరంగా గొడవలు పడుతున్నవారి గురించి విచిత్రమైన నిజమైన కథనాలు చాలా ఉన్నాయి.

  • 48 ఏళ్ల వ్యక్తి  టీవీ ప్రోగ్రామ్ చూసే విషయంలో భార్యతో గొడవపడి ఆమెను హత్య చేశాడు.
  • రెస్టారెంట్ నుండి వేరే టిఫిన్ ఇంటికి తీసుకువచ్చినందుకు ఒక వ్యక్తిని అతని స్నేహితురాలు కత్తితో పొడిచి చంపింది.
  • తమ ఇంట్లో థర్మోస్టాట్ పెట్టే విషయంలో జరిగిన గొడవలో 37 ఏళ్ల వ్యక్తిని అతని రూమ్‌మేట్ కొట్టి చంపాడు.
  • 15 ఏళ్ల బాలుడు తనకు ఇష్టంలేని సంగీతాన్ని వింటున్నాడన్న కారణంతో కారులో కూర్చున్న ఒక వ్యక్తిని కాల్చి చంపాడు.
  • ఒక బాస్కెట్‌బాల్ కోచ్‌ను ఒక విద్యార్థిని తండ్రి ఒక గుద్దుతో నేలపై పడవేసి ఆపై అతనిపైకి ఎక్కి దాడిచేసి అపస్మారక స్థితిలోనికి వెళ్లేవరకు అతని ముఖంపై తలపై పదేపదే కొట్టాడు. అతని కోపానికి కారణం? ఆ కోచ్ ఒకరితో ఒకరు వాదించుకుంటున్న ఇద్దరు విద్యార్ధులను శిక్షస్తూ గ్రౌండులో కొన్ని రౌండులు పరుగెత్తించడమే.

మీరు బయటకు వెళ్లిన ప్రతిసారీ మానవ సంబంధాలను ప్రభావితం చేసే ఆవేశపూరితమైన సంఘటనల గురించి వింటూ ఉంటారు. ఒక ప్రసిద్ధ క్రైస్తవ కౌస్సిలర్ జే ఆడమ్స్ తాను కౌన్సెలింగ్ చేసే సమస్యలలో 90 శాతం పాపపూరిత కోపానికి సంబంధించినవేనని అంచనా వేశారు. అది నిజమే అనిపిస్తుంది! కోపం నిజంగా మన జీవితాలను నాశనం చేస్తుంది. జీవితాలను మార్చగల శక్తిని కలిగిన భావోద్వేగాలలో ఇది ఒకటి.

  • ఒకరినొకరు ప్రేమించుకునే వ్యక్తులు ఒకే ఇంట్లో సహజీవనం చేయడానికి అవసరమైన వాటిని మాత్రమే చేసేలా నిర్దయగా, ఉద్దేశపూర్వకంగా గొడవలుపడే వివాహ భాగస్వాములుగా మారిపోతారు.
  • మంచి స్నేహితులు బద్దశత్రువులుగా మారిపోతారు.
  • కుటుంబాలు కలిసి సంతోషంగా గడుపుతున్న సమయంలో జరిగిన గొడవ  అంత త్వరగా తీరదు.
  • తమ పిల్లల ముఖాలపై పదే పదే ఒకేవిషయాన్ని చెప్పేవారు ప్రేమించి శ్రద్ధ వహించే తల్లిదండ్రుల నుండి కేకలువేసే పెద్దవారిగా మారిపోతారు.
  • ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, చాలాకాలం ఉద్యోగిగా ఉన్న వ్యక్తి తాను ఉద్యోగం నుండి తొలగించబడ్డాననే చిన్న కారణంతో ఆయుధాలను ధరించి ఆఫీసు భవనంలో ప్రతి అంతస్తుకు వెళ్లి అమాయక ప్రజలపై కాల్పులు జరిపి గాయపరచి చంపిన ఉన్మాదిగా మారాడు.

“మీ కోపాన్ని మీ ఉత్తమ లక్షణాలను ఆధిపత్యం చేయడానికి మీరు అనుమతిస్తే, అది మీ చెత్త లక్షణాలను బయటకు తెస్తుంది”, అనే మాట చాలా వాస్తవము. కోపమనేది పురుషులకు మాత్రమే కాదు మహిళలకు కూడా సమస్యే. ఇది క్రైస్తవులతో సహా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సార్వత్రిక సమస్య!

క్రైస్తవులమని చెప్పుకునే అనేకమంది బయటివారితో దయగా ఉంటూ తమ కుటుంబంలో ఉన్న వారిపై చాలా కోపం చూపించడం చాలా బాధాకరమైన విషయము. అనేక క్రైస్తవ గృహాలు ధ్వంసమైపోవడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. చాలామంది విశ్వాసులు సామెతలు 17:1లో చెప్పిన ఇంటిలో ఉండాలని కోరుకుంటారు, “రుచియైన భోజన పదార్థములున్నను కలహముతోకూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు.”

అయినప్పటికీ, అదుపులేని కోపం కారణంగా ఆనందకరమైన ఇల్లు ఒక కలగానే కనిపిస్తుంది. నిరీక్షణ ఉందా అంటే ఉంది. మనం కోపమనే సమస్యను సరైన మార్గంలో అనగా బైబిలులో తెలియచేసిన దేవుని మార్గంలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే నిరీక్షణ ఉంటుంది. బైబిలే ఎందుకు? ఎందుకంటే కోపాన్ని వైద్యపరంగా నయం చేయలేము; కోపమంటే పాపం కాబట్టి అది ఆధ్యాత్మిక సమస్య అవుతుంది. ఆధ్యాత్మిక సమస్యలను ఆధ్యాత్మిక సత్యాల ద్వారా మాత్రమే అధిగమించవచ్చు.

మనకు 2 తిమోతి 3:16-17లో 16-17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది” అని వ్రాయబడి ఉంది. కోపం మరియు ప్రతి ఇతర సమస్యను ఎదుర్కోవటానికి లేఖనాలు సరిపోతాయని ఈ వాక్యాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి! అందుకే రాబోయే బ్లాగ్ పోస్ట్‌లలో పాపపూరిత కోపాన్ని మనం ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చో ఈ లేఖనాల నుండి తెలియచేయబడతాయి. పాపపూరిత కోపం వలన వచ్చే వినాశకరమైన స్వల్ప మరియు దీర్ఘకాలిక పరిణామాల కారణంగా మనం బాధితులం కాకుండా మనల్ని మనం నిరంతరం కాపాడుకోవడం చాలా అవసరము.

దయచేసి ఈ సిరీస్ చదివిన వారందరికీ ఒక ఆశీర్వాదంగా ఉండాలని మరియు తనను తాను “సాత్వికుడను దీనమనస్సు గలవాడను” [మత్తయి 11:29] అని వర్ణించుకున్న యేసులాగా మనల్ని తయారు చేసేందుకు పరిశుద్ధాత్మ దానిని ఉపయోగించాలని ప్రార్థించండి.

Category