నరకానికి సంబంధించిన వాస్తవాలు మరియు సలహాలు – 1వ భాగము

Posted byTelugu Editor May 23, 2023 Comments:0

(English version: Hell – Its Realities and Implications – Part 1)

నరకం అనేది ఎక్కువ ఆదరణ పొందిన అంశం కాదు, సంఘంలో కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే నరకం గురించి బైబిలు చాలా తెలియచేస్తుంది కాబట్టి ఇది చాలా క్లిష్టమైనది. ఈ అంశం మనకు సౌకర్యంగా ఉందా అసౌకర్యంగా ఉందా అనేది ఇక్కడ విషయం కాదు కాని మన శాశ్వతమైన ప్రయోజనాల కోసం మనం నిరంతరం ఆలోచించవలసిన కఠినమైన సత్యాల గురించే.

గత శతాబ్ధంలో ఉన్న జేసి రేలి అనే భక్తిపరుడైన బోధకుడు నరకం గురించి ఏమి రాసాడంటే, “మంటను చూసినప్పుడు మౌనంగా ఉండే వాచ్‌మెన్ నిర్లక్ష్యమనే తప్పు చేసిన వాడు అవుతాడు.  మనం చనిపోతున్నా మనం ఇంకా బాగుపడతామని చెప్పే డాక్టరు అబద్ధపు స్నేహితుడవుతాడు. పరిచర్యలో ఉన్నవారు తన ప్రజలకు బోధలలో నరకం గురించి చెప్పకపోతే అతడు నమ్మకమైనవాడు కాడు అలాగే దాతృత్వం (ప్రేమ) ఉన్న వ్యక్తి కాడు.”

నేను విశ్వాసపాత్రుడిగా మరియు దాతృత్వంతో [ప్రేమతో] ఉండాలనుకుంటున్నాను కాబట్టి, నరకం యొక్క 4 వాస్తవాలను మరియు ఈ వాస్తవాలకనుగుణంగా సలహాలను ఇస్తూ ఈ నరకమనే అంశాన్ని తెలియచేయాలనుకుంటున్నాను.

వాస్తవము # 1. నరకము నిజమైనదే.

ఎవరో ఒకరు నరకం ఉందని నమ్మలేదని నరకం ఉండకుండాపోదు. నరకం నిజంగానే ఉంది. నరకం నిజంగా లేకపోతే, యేసు మనల్ని హెచ్చరించడమే కాకుండా మనం ఆ స్థలానికి వెళ్ళకూడదని మనకొరకు చనిపోవడానికి ఈ లోకంలోనికి ఎందుకు వస్తారు? మత్తయి 10:28లో “ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి” అని యేసు మనల్ని హెచ్చరించారు. నరకమనేదే లేకపోతే ఈ మాటలకు  అర్థమే లేదు. మనం పరలోకం ఉందని నమ్మితే నరకం కూడా ఉందని నమ్మాలి. దేవుని పరిశుద్ధత మరియు నీతిని బట్టి పాపం ఖచ్చితంగా శిక్షించబడాలి అది సిలువలోనైనా లేదా వ్యక్తిగతంగానైనా.

మనం చనిపోతే వెంటనే ఈ రెండింటిలో ఒకదానికి వెళ్తాము. విశ్వాసులైతే పరలోకానికి వెళ్తారు. అవిశ్వాసి మొదట పాతాళమని పిలువబడే చోటికి వెళ్ళి(బాధించబడే చోటు) తర్వాత తీర్పుదినాన నరకంలో పడవేయబడతారు. ఎలాగైతే పరలోకం  నిజంగా ఉందో అలాగే నరకం కూడా నిజంగానే ఉంది.

వాస్తవము  2. నిత్యం హింస అనుభవించే స్థలమే నరకము.

1. ఇది శాశ్వతమైనది: మత్తయి 25:46లో “వీరు (అంటే, దుష్టులు) నిత్యశిక్షకును, నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు” అని యేసు చెప్పారు. పరలోకం గురించి నరకం గురించి చెబుతున్నప్పుడు రెండింటిని నిత్యము అనే ఒకే పదంతో వివరించారు కాబట్టి అవి రెండూ శాశ్వతమైనవి. అంటే పరలోకం గురించి చెబుతున్నప్పుడు శాశ్వతమైనది అని నరకం దగ్గరకి వచ్చేసరికి తాత్కాలికమైనదని మనం చెప్పకూడదు.

2. ఇది బాధించబడే స్థలము: నరకాన్ని అగ్నిగుండంతో పోల్చారు. మత్తయి 3:12లో బాప్తిస్మమిచ్చు యోహాను నరకాన్ని “ఆరని అగ్నితో” పోల్చాడు.  మార్కు  9:43-44లో యేసు, “నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; నీవు రెండు చేతులుకలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు” అని చెప్పారు. మరికొన్ని వచనాల తర్వాత మార్కు  9:47-48లో “నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపార వేయుము; రెండు కన్నులుకలిగి నరకములో పడవేయబడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. 48నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు” అని చెప్పారు.

2 థెస్సలొ 1:8-9లో పౌలు “ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతి దండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే” అని వ్రాసాడు. బైబిలులోని చివరి గ్రంథంలో ప్రభువైన యేసును అంగీకరించని వారందరి అంతం గురించి వ్రాయబడింది. “మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము. 15ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను” (ప్రకటన 20:14-15).

ఈ వచనాలన్ని నరకం గురించి వివరిస్తాయి.

3. ఇది ప్రజలు నిత్యం హింస అనుభవించే స్థలము:  ఒకరు బాధ అనుభవించే స్థలమే నరకము. నరకంలో అనుభుతి చెందుతారు. అయితే అది కేవలం బాధను మాత్రమే; అది కూడా నిరంతరం అంతులేని బాధను అనుభవిస్తారు. ఎటువంటి ఉపశమనం ఉండదు. బాధనుండి విరామం లభించదు. మత్తయి 25:30లో  యేసు, “పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను” అని చెప్పారు. “ఏడ్పు పండ్లు కొరుకుట ఉంటాయని” చెబుతూ నరకంలో నిత్యం బాధించబడతారని యేసు వివరించారు.   ఇది సరిపోకపోతే, యేసు ఆ స్థలాన్ని “చీకటి” అని అన్నారు; అది పూర్తి నిరాశకు గుర్తుగా ఉంది.

అలాగే యేసు ఒక ధనవంతుని గురించి పేదవాడైన లాజరు గురించి చెప్పిన ఉపమానంలో ధనవంతుడు పాతాళంలో ఎలా బాధ అనుభవించారో వివరించారు. ఆ ధనవంతుని భయానక స్థితి గురించి లూకా 16:23-24లో మనం చదువుతాము: “అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి 24తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను.” ధనవంతుడు బాధ అనుభవిస్తున్నాడని ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది.

మనిషికి మనిషికి అనుభవించే బాధలో తేడా ఉంటుందే కాని ఆ బాధ నిత్యం ఉంటుంది. (దుష్టులైనవారు ఎక్కువ బాధ అనుభవిస్తారు.) ప్యూరిటను వ్యాఖ్యతయైన మాథ్యూ హెన్రీ ఈ గొప్ప మాటలు వ్రాసారు: “ఒక వ్యక్తి మెతుషెలా జీవించినంత కాలం జీవించి పాపంలో ఉండే ఆనందాలన్నిటిని అనుభవిస్తూ తన రోజులన్నిటిని గడిపిస్తే, తర్వాత దాని ఫలితంగా వారనుభవించే ఒక గంట వేదన దుఃఖం వాటన్నిటి కన్న అధికంగా ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే, ఈ భూమి మీద ఒకరు అనుభవించే ఘోరమైన బాధన ఊహించండి. ఇప్పుడు ఆ బాధను 1000 రెట్లు కాదు 10,000 రెట్లు కాదు పదిలక్షల రెట్లు చేసినా అని నిత్యనరకంలో అనుభవించే బాధకు సమానం కాలేదు.

శారీరకమైన బాధతో పాటు మానసికమైన బాధ కూడా ఉంటుంది ఎందుకంటే ఒకరిని నరకంలో వేసేటప్పుడు దేవుడు వారి మనస్సును తీసివేయరు. ఒక వ్యక్తి నరకంలో అనుభవించే మానసిక బాధ గురించి ఒక రచయిత ఇలా వ్రాసారు: 

“నరకంలో మనిషి మనస్సును తీసివేస్తే అది దేవుని కరుణ, కాని అది ఖచ్చితంగా నరకపు వేదన. ఇప్పుడు కాదు చాలా కాలం క్రితమే దయచూపించే సమయం అయిపోయింది. అబద్దపు కరుణ, కపటమైన అందంలేకుండా ఒక వ్యక్తి తనతో తానే జీవించాలి. అతడు తన శరీరంలో ఏ బాధతో బాధించబడుతున్నప్పటికి అతనిని చాలా ఎక్కువగా బాధించేది అతని మనస్సే. పురుగు చావదు అని చెప్పిన మాటకు బహుశ ఇదే అర్థమేమో.”

అతడు ఎలా ఉన్నాడో అలాగే నిరంతరం ఉంటాడు అతనిలో ఏ మార్పు రాదు, ఎటువంటి ఉపశమనం కలుగదు నిరీక్షణ లేదు, మరలా సంతోషం గాని ప్రేమ గాని ఉండదు అనే  ఆందోళన కలిగించే స్పృహ అతని మనస్సులో మెదులుతూ ఉంటుంది. అతడు ఎప్పుడూ ద్వేషించాలనుకుంటాడు ప్రేమించాలని మరలా కోరుకోడు; అతడు అలాంటి కోరిక కలిగిఉంటాడు ఆపై దేవునిపై అతనికున్న ద్వేషం చాలా ఎక్కువ కాబట్టి అలా కోరుకున్నందుకు తనను తానే ద్వేషించుకుంటాడు.

ఒకరు నిరంతరం బాధించబడడం అన్యాయం కాదా? అని ఎవరైనా అనుకోవచ్చు. సమస్య ఏమిటంటే,  మరణించిన సమయంతోనే పశ్చాత్తాపం చెందడానికి ఉన్న సమయం అయిపోయింది కనుక నరకంలో కూడా ప్రజలు పశ్చాత్తాపం చెందరు. అక్కడ వారు తిరుగుబాటు చేస్తూ తమ పాపాలను పెంచుకుంటూ పోతారు. ఆ కారణంగా వారు నిత్యం బాధించబడుతూనే ఉంటారు.

వాస్తవము#3. భయంకరమైన దుర్మార్గులు అలాగే మంచివారు కలిసివుండే స్థలమే నరకము.

1 కొరింథి 6:9-10లో పౌలు “9 అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను 10 దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు” అని రాశాడు. దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేని పాపుల జాబితాను పౌలు తెలియచేశాడు. దొంగలు, దూషించేవారు, లైంగిక దుర్నీతిగలవారు త్రాగుబోతులు, మోసగాళ్ళు వీరంతా నరకానికి వెళ్తారు. మరోరకంగా చెప్పాలంటే, మంచివాడని పిలువబడిన ధనవంతుడైన యవ్వనస్థుడు (మత్తయి 19:16-22) అక్కడ హిట్లరు మరియు స్టాలిన్‌తో పాటు కలిసి ఉంటాడు.

యేసు ఏమిచెప్పారంటే, “నరకమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు” (మత్తయి 7:13). దుర్మార్గులైన ప్రజలు మాత్రమే కాదు సాతాను అతని దూతలు కూడా ఉండేది నరకంలోనే (మత్తయి 25:41). ఒకసారి ఊహించండి. అక్కడ దుర్మార్గులైన ప్రజలతో ఉండడమే కాదు నిత్యం సాతాను అతని దూతలతో సహావాసం చేయాలి.

వాస్తవము# 4. నిరీక్షణలేని స్థలము నరకము.

నరకంలో ఉండే ప్రజలకు కేవలం నిరాశ మాత్రమే ఉంటుంది. దానిలో నుండి బయటపడతామన్న నిరీక్షణ అసలు ఉండదు. లూకా 16:24-28లో “24 తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను–నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను. 25 అందుకు అబ్రాహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. 26 అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను. 27 అప్పుడతడు తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు. 28 వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను” అని చదువుతాము. 

తాను ఉన్న చోటికి తన కుటుంబసభ్యులు రాకుండా ఉండాలని ఆ ధనవంతుడు అబ్రాహామును వేడుకున్నప్పుడు దానిలో ఉన్న అత్యవసరాన్ని గమనించండి. ఎందుకంటే ఒకసారి అక్కడికి వెళ్ళాక అక్కడి నుండి తప్పించుకొనే మార్గం ఉండదు. నిత్యం బాధించబడతారు. ఏమైనప్పటికి విడుదల కలుగుతుందనే నిరీక్షణ ఉండదు. సంతోషంగాని ఉపశమనం గాని ఒక్క నిముషమైన ఉండదు. అది ఎంత భయంకరంగా ఉంటుందో కదా! నిజానికి దయ్యాలు కూడా అక్కడికి వెళ్లాలనుకోవు ఇది చాలా ఘోరము. అందుకనే దయ్యాలు తమను పాతాళానికి పంపించకుండా పందులలోనికి పంపించమని యేసుని అడిగాయి (లూకా 8:28,31).

నరకానికి సంబంధించిన న 4 వాస్తవాలు ఏమిటంటే:  1) ఇది నిజంగానే ఉంది; 2) ఇది నిత్యం హింస అనుభవించే స్థలము; 3) ఇది భయంకరమైన దుర్మార్గులు అలాగే మంచివారు కలిసివుండే స్థలము; 4) ఇది నిరీక్షణ లేని స్థలము.

నరకం గురించిన వివరణలలో ఏమి నిజాలు ఏవి ఊహాజనితాలు అని వాదించడం చాలా కష్టమైనా, నరకం అనేది శారీరకంగాను మానసికంగాను బాధించబడే స్థలం అనే వాస్తవం మారదు. ఈ వాస్తవాల గురించి విశ్వాసుల మరియు అవిశ్వాసుల ప్రతిస్పందన ఎలా ఉంటుంది?  దీని జవాబు రెండవ భాగంలో ఉంటుంది.

Category

Leave a Comment