దేవునితో మనల్ని మనం ఎలా సరి చేసుకోవాలి?

మీరు 75 సంవత్సరాలు జీవిస్తారనుకోండి, మీ వయోజన జీవితం 15 సంవత్సరాల నుండి ప్రారంభమవుతుంది. అంటే 75 సంవత్సరాలు వచ్చేసరికి, మీరు 60 సంవత్సరాలు పెద్దవారిగా జీవించి ఉండవచ్చు. ఆ 60 ఏళ్లలో మీరు రోజుకు ఒక పాపం చేశారనుకుందాం, మీరు చేసిన మొత్తం పాపాల సంఖ్య సుమారు 21,900. రోజుకు 5 పాపాలు చేస్తే, మొత్తం 109,500 అవుతుంది. రోజుకు 10 పాపాలు చేస్తే, మొత్తం 219,000 అవుతుంది!
బైబిలు ప్రకారం, చెడు ఆలోచన కూడా పాపమే (మత్తయి 5:28). కేవలం తప్పు పనులు చేయడమే పాపం కాదు (1 యోహాను 3:4) కాని అన్ని సమయాల్లో సరైన పనులను చేయడంలో విఫలం అవ్వడం కూడా పాపమే (యాకోబు 4:17). అలాగే విశ్వాసం లేకుండా చేసేది ఏదైనా పాపమే అవుతుంది (రోమా 14:23).
దీని ప్రకారం ఏ మనిషైనా రోజుకు చేసే మొత్తం పాపాల సంఖ్య 10 కంటే చాలా ఎక్కువగా ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పగలం! మీరు ఈ రోజు నుండి పాపరహిత జీవితాన్ని గడిపినప్పటికీ (ఇది అసాధ్యం), మీరు ఇప్పటికే చేసిన పాపాలను మీరు ఇంకా లెక్క చెప్పవలసి ఉంటుంది. కాబట్టి, మీరు దేవునితో ఎలా సరి చేసుకుంటారు? క్రింద వివరించిన సత్యాలను అర్థం చేసుకోవడం మరియు విధేయత చూపటం ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది.
పరిశుద్ధుడైన దేవుడు తనను గౌరవించడానికి మరియు ఆరాధించడానికి మనల్ని సృష్టించాడు. 1 అయితే, మనం ఆయనను ఆరాధించడానికి బదులుగా ఈ పరిశుద్ధ దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి ఎంచుకున్నాము. 2 పాపం అంటే మనం చేసిన చెడ్డ పనులు మాత్రమే కాదు, మనం చేయడంలో విఫలమైన మంచి పనులు కూడా పాపమే. 3
పాపానికి శిక్ష నరకంలో నిత్య మరణమే. 4 మనం చేసిన పాపాలను ఎన్ని మంచి పనులు చేసినా పూడ్చలేవు. 5 అందుకే, దేవుడు తన ప్రేమతో తన కుమారుడూ ప్రభువైన యేసుక్రీస్తును మనకు బదులుగా భూమి మీదికి పంపారు. 6 ఆయన మన పక్షాన పరిపూర్ణ జీవితాన్ని గడిపి మనం చేసిన పాపాలకై సిలువపై మన స్థానంలో మరణించారు. మన పాపాల కోసం ఆయన చేసిన పరిపూర్ణ త్యాగాన్ని అంగీకరించానని తెలియజేయడానికి దేవుడు మూడవ రోజున ఆయనను సజీవంగా తిరిగిలేపారు. 7
మన పాపపు మార్గాల నుండి పశ్చాత్తాపం చెంది పాప క్షమాపణ కోసం యేసుపై మాత్రమే నమ్మకం ఉంచడం ద్వారా మనం దేవునితో సరిదిద్దబడగలము. 8 ఆ విధంగా, మనం ఆధ్యాత్మిక స్వభావంతో కూడిన నూతన జన్మను అనుభవించి దేవుని బిడ్డగా అవుతాము. 9 మీరు మునుపెన్నడూ ఇలా చేయని పక్షంలో, మీ పాపాలను విడిచిపెట్టి విశ్వాసంతో మీ జీవితాన్ని యేసుకు అప్పగించి, మిమ్మల్ని రక్షించమని హృదయపూర్వకంగా ఈ రోజే దేవునికి మొరపెడతారా? 10
లేఖనాలు: 1 ప్రకటన 4:11; 2 రోమా 3:23; 3 1 యోహాను 3:4, యాకోబు 4:17 4 రోమా 6:23 5 ఎఫెసి 2:8-9 6 రోమా 5:8 7 1 పేతురు 3:18 8 అపొ.కా 3:19, 16:31 9 యోహాను 3:3 10 రోమా 10:13; మార్కు 1:15