“యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను”
కీర్తనలు 130:5
దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చే వరకు వేచి ఉండటమే మన క్రైస్తవ జీవితంలో మనం ఎదుర్కొనే అతి పెద్ద సమస్య అని చెప్పబడింది; మనం వేచి ఉండడానికి బదులు తప్పు పని చేస్తాము. అయితే వేచి ఉండటం కష్టంగా అనిపించినప్పటికీ, దేవుడు మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తులా మార్చే మార్గాలలో ఇది ఒకటి. 130వ కీర్తనలో కీర్తనాకారుడు ఆయన మాటపై నమ్మకం ఉంచడం ద్వారా ప్రభువు విడుదల కోసం ఓపికగా నిరీక్షిస్తూ ఉన్నాడు. అతని మాదిరిని అనుసరిద్దాం. ఆ దిశగా, పరిశుద్దాత్మ శక్తి ద్వారా దేవుని వాక్యం నుండి బలాన్ని పొందడం ద్వారా ప్రజలు ఓపికగా నిరీక్షణతో వేచివుండేలా చేయడమే ఈ బ్లాగ్ లక్ష్యము.